* వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.చమురు కంపెనీలు వాహనదారులకు మళ్లీ షాక్ ఇచ్చాయి.బుధవారం వరకు పెరుగుతూ వచ్చిన ఇంధన ధరలు.. గురవారం పెరుగలేదు.ఈ క్రమంలో వాహనదారులు కాస్త ఊపిరిపీల్చుకోగా.. శుక్రవారం మళ్లీ పైకి కదిలాయి.దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌కు 29 పైసలు, డీజిల్‌పై 34 పైసలు పెంచాయి.తాజా పెంపుతో ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.92.34, పెట్రోల్ రూ.82.95కు పెరిగాయి.ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ రూ.93.36, డీజిల్, రూ.89.75, చెన్నైలో రూ.93.84, డీజిల్ రూ.87.49, కోల్‌కతాలో రూ.92.16, డీజిల్ రూ.85.45, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.95.97, డీజిల్ రూ.90.43, జైపూర్‌లో రూ.99.02, డీజిల్ రూ.91.80కి చేరాయి.ఇప్పటి వరకు ఈ నెలలో ఎనిమిది సార్లు పెట్రోల్ రేట్లు పెరిగాయి. పెట్రోల్‌పై రూ..1.94, డీజిల్‌పై రూ.2.22 పెరిగింది.దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరగా……మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లోని పలు చోట్ల లీటర్ పెట్రోల్ రూ.100 మార్క్‌ను దాటింది.రోజు రోజుకు ఇంధన ధరలు పైపైకి వెళ్తుండడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.
* రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వి శుక్రవారం నుంచి భారత మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. దీని ఒక్కో డోసు ధరను జీఎస్టీతో కలుపుకొని రూ.995.40గా నిర్ణయించారు. భారత్‌లో స్పుత్నిక్-వి ఉత్పత్తి, పంపిణీ కోసం రష్యన్ సంస్థతో ఒప్పందం చేసుకున్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సీఈఓ ఎం.వి.రమణ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీకాను అత్యుత్తమ నాణ్యతతో అందరికీ అందబాటులోకి తీసుకొచ్చేందుకు డాక్టర్ రెడ్డీస్ పాటుపడుతోందని తెలిపారు. ఇక ధర గురించి మాట్లాడుతూ.. రష్యా నుంచి దిగుమతి, (మైనస్) -18 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సి ఉండడం వంటి అంశాల ఆధారంగా ధరను నిర్ణయించినట్లు తెలిపారు. మొత్తం 250 మిలియన్ డోసులను డాక్టర్ రెడ్డీస్ నుంచి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. వీటిలో రష్యా నుంచి కేవలం 15-20 శాతం డోసులు మాత్రమే దిగుమతి చేసుకుంటామని తెలిపారు. మిగిలిన వాటిని తమ సంస్థ భాగస్వామ్య కంపెనీలలో ఉత్పత్తి చేస్తామని పేర్కొన్నారు.
* దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఆద్యంతం ఊగిసలాట ధోరణి కనబరిచాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు కాసేపట్లోనే నష్టాల్లోకి జారుకున్నాయి. మళ్లీ అంతలోనే కోలుకొని స్వల్పకాలం లాభాల్లో కొనసాగాయి. ఇలా రోజంతా సూచీల పయనం ఒడుదొడుకులమయంగా సాగింది. చివరకు సెన్సెక్స్ 41 పాయింట్ల స్వల్ప లాభంతో 48,732 వద్ద ముగియగా.. నిఫ్టీ 18 పాయింట్ల స్వల్ప నష్టంతో 14,677 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.28 వద్ద నిలిచింది. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ.. కొవిడ్ భయాలు మదుపర్లను వెంటాడాయి. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల్లోని అస్థిరత, వ్యాక్సినేషన్‌పై కొనసాగుతున్న అనిశ్చితి సైతం మదుపర్లను అప్రమత్తం చేశాయి. ఇక కీలక రంగాల షేర్లు రాణించకపోవడం సూచీలపై ప్రభావం చూపింది.