ప్రధానమంత్రి నరేంద్రమోదీతో వైకాపా అధినేత, ఏపీ కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదివారం సమావేశమయ్యారు. దాదాపు గంటా 20 నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని సమస్యలను జగన్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ భేటీ అనంతరం వారివురి మధ్య జరిగిన చర్చల సారాంశాన్ని మోదీ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. జగన్‌తో జరిగిన భేటీపై మోదీ తెలుగులో ట్వీట్ చేయడం విశేషం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తామని ఈ సందర్భంగా మోదీ హామీ ఇచ్చారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన జగన్‌తో అద్భుతమైన సమావేశం జరిగింది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఫలవంతమైన చర్చలు జరిపాం. ఆయన పదవీకాలంలో కేంద్రం నుంచి సాధ్యమైనంత సహకారం అందిస్తామని హామీ ఇస్తున్నాను’’ అని మోదీ ట్విటర్ వేదికగా వెల్లడించారు. మోదీతో భేటీ అనంతరం జగన్.. భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షాతో సమావేశమయ్యారు. అనంతరం ఏపీ భవన్‌కు చేరుకున్నారు.
జగన్‌కు భారీగానే హామీలు ఇచ్చిన మోడీ
Related tags :