Health

ఇండియాలో స్పుత్నిక్ వ్యాక్సినేషన్ డ్రైవ్-TNI కోవిద్ బులెటిన్

Sputnikv-V Vaccine Drive Launched In India

* కొవిడ్‌పై పోరుకు కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌తో పాటు భారత్‌లో అత్యవసర వినియోగానికి అందుబాటులోకి వచ్చిన స్పుత్నిక్‌- వి.. వ్యాక్సినేష‌న్ డ్రైవ్ ప్రారంభ‌మైంది. దీనికి సంబంధించిన సాఫ్ట్ లాంచ్‌ను అపోలో హాస్పిటల్స్ ఈ ఉద‌యం ఆవిష్క‌రించింది. డా. రెడ్డీస్ సిబ్బంది అశోక్‌కు స్పుత్నిక్ మొదటి డోసు వేసి వాక్సినేషన్ డ్రైవ్‌ను మొద‌లుపెట్టింది. డాక్టర్ రెడ్డీస్ భాగస్వామ్యంతో అపోలో గ్రూప్ ఆసుపత్రుల్లో వాక్సినేషన్ పైలెట్ ప్రాజెక్ట్ ను అపోలో గ్రూప్ ప్రెసిడెంట్ డా. కె.హరిప్రసాద్, డా.రెడ్డీస్ సీఈవో ఎం.వి.రమణ ప్రారంభించారు. హైదరాబాద్, విశాఖపట్నంల‌లో ఏక‌కాలంలో ఈ వ్యాక్సినేష‌న్ డ్రైవ్ ప్రారంభ‌మైంది.

* కావలి పట్టణ ఏరియా ఆసుపత్రిలో కరోనా పేషెంట్లకు చుక్కలు చూపిస్తున్న ఆసుపత్రి స్టాఫ్ పట్టించుకునే నాథుడే లేడు అధికారుల కాళ్లు మొక్కతాం మమ్మళ్లి బతికించండి అని వేడుకొంటున్న పేషేంట్లు.

* విజయవాడ CCS ఇన్స్పెక్టర్ బోనం సాయి రమేష్ కరోనా తో చికిత్స పొందుతూ ప్రభుత్వ ఆసుపత్రి లో మృతి

* ఏపీలో నమోదైన మొత్తం 14,51,157 పాజిటివ్ కేసులకు గాను 12,30,122 మంది డిశ్చార్జ్ కాగా 9,481 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,11,554.

* కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు 10 లక్షల రూపాయలు ఫిక్సిడ్ డిపాజిట్ చేయనున్న ఏపీ ప్రభుత్వం

* కర్ఫ్యూ వల్ల కేసులు తగ్గుముఖం పడుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగించాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే కార్యకలాపాలకు అనుమతి ఉంటుందని తెలిపారు. నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారన్నారు. బ్లాక్ ఫంగస్ సోకిన వారికి ఆరోగ్య శ్రీ పరిధిలో చికిత్స చేయాలని సీఎం ఆదేశించాదన్నారు. పాజిటివ్ పేషంట్ల గుర్తింపు కోసం ఫీవర్ సర్వే చేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మరింత పకడ్బంధీగా ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నామన్నారు.