Movies

ఆ అశ్లీల దృశ్యాలు బాధించాయి. వర్మ మోసం చేశాడు.

ఆ అశ్లీల దృశ్యాలు బాధించాయి. వర్మ మోసం చేశాడు.

‘నటిగా నాకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో శ్రమించాను. ఎన్నో సాహసాలు చేశాను. 2015లో నేను నటించిన ‘పార్చ్‌డ్‌’ వల్ల ఇబ్బందులు పడ్డాను. స్త్రీ విద్య, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలియజేస్తూ తెరకెక్కిన ‘పార్చ్‌డ్‌’లో కొన్ని అశ్లీల సన్నివేశాల్లో నేను కనిపించాను. ఆ చిత్రాన్ని థియేటర్‌లో విడుదల చేయడానికంటే ముందు టోరెంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. దాంతో నేను నటించిన అశ్లీల సన్నివేశాలు ఆన్‌లైన్‌లో లీక్‌ అయ్యాయి. అందరూ నా గురించి తప్పుగా మాట్లాడుకున్నారు. నాపై విమర్శల వర్షం కురిపించారు. నా డ్రైవర్‌, వాచ్‌మెన్‌, అలాగే నా స్టైలిష్ట్‌.. ఇలా ప్రతిఒక్కరూ నన్ను గుర్తుపట్టారు. దాంతో నేను నాలుగు రోజులు ఇంటి గడప దాటలేదు. ఎంతో బాధగా అనిపించింది. కానీ అలాంటి చిత్రంలో నటించినందుకు ఒకింత ఆనందంగా ఉంది. నాకు చెడ్డ పేరు రావడానికి బదులు.. సినిమాకి మంచి పేరు వచ్చివుంటే ఎంతో బాగుండేది’ అని రాధిక వివరించారు. అనంతరం ‘రక్తచరిత్ర’ సమయంలో రామ్‌గోపాల్‌వర్మ చేసిన పని కారణంగా తాను బాధపడ్డానని నటి తెలిపారు. తనకి ఆ సినిమాలో ఆఫర్‌ ఇచ్చినప్పుడు కేవలం తెలుగు చిత్రమనే చెప్పారని.. కానీ షూటింగ్‌ సమయంలో తెలుగు, తమిళ భాషల్లోనూ ‘రక్తచరిత్ర’ తెరకెక్కించారని ఆమె అన్నారు. అంతేకాకుండా తనకి ఒక సినిమాకి ఇచ్చే పేమెంట్‌ మాత్రమే ఇచ్చారని రాధిక వాపోయారు.