ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి గొడుగు పట్టే ‘పవర్’ బ్రోకర్లు ఆంధ్రాలోనే కాదు అమెరికాలోనూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం ఆపార్టీలో మహానాయకుడిగా ఫోజులు కొట్టి ఒక ప్రముఖ ఎంపీకి ముఖ్య అనుచరుడుగా మెలుగుతూ అమెరికాలో హల్చల్ చేసిన ఒక ప్రబుద్ధుడు 2014లో చంద్రబాబు అధికారంలోకి రాగానే మొట్టమొదటగా ఆయన కోటరీలో చేరిపోయాడు. చంద్రబాబు దగ్గర ఆటలు సాగకపోవడంతో చిన్నబాబు వద్దకు చేరాడు. ఎప్పుడూ లోకేష్ పక్కనో ఆయన ఛాంబర్‌లోనో దర్శనమిస్తూ ఉండేవాడు. అమెరికా నుండి అమరావతికి మకాం మార్చి పైరవీల్లో ఆరితేరాడు. పలు బోగస్ ఐటీ కంపెనీలను అమరావతికి తీసుకురావడంలో ఈ ప్రబుద్ధుడు కీలకపాత్ర పోషించాడు. లోకేష్ తనకు సన్నిహితుడు అంటూ చాలా వ్యవహారాలను చక్కదిద్దాడు. అమెరికాలో తెలుగుదేశం పార్టీని పటిష్ఠవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన కోమటి జయరాం, వేమన సతీష్ వంటి వారిపై ఎప్పుడూ లోకేష్‌కు వ్యతిరేక వార్తలు చెపుతూ వారిని లోకేష్ దరిదాపుల్లోకి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. న్యూయార్క్ పంతులుగా అమెరికాలో పేరుపొందిన ఈ అయ్యవరు కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు చంద్రబాబును బండబూతులు తిట్టడం, అప్పట్లో ఆడియో రూపంలో బయటకు వచ్చి సంచలనం సృష్టించింది. అయినప్పటికీ లోకేష్ వద్ద ఆయన పరపతి ఏమాత్రం తగ్గలేదు.
*** జగన్‌ను కలిశాడంట
ఇప్పుడు అమెరికాలోనూ ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. న్యూయార్క్ పంతులు ఫలితాలు వెలువడిన మరుసటి రోజునే జగన్‌ను ఆయన స్వగృహంలో కలిసి శుభాకాంక్షలు తెలిపాడంట. ఈ విషయాన్ని గమనించిన ఒక వైకాపా ఎంపీ అమరావతిలో ఉన్న తానా కీలక నేతకు ఈ విషయం చెప్పారంట. పనిలో పనిగా మీరు కూడా జగన్‌ను కలిసి వెళ్లమని తానా నేతలకు సదరు ఎంపీ సూచించినట్లు వార్తలు వెలువడ్డాయి.
న్యూయార్క్ పంతులు…జగన్‌ను కలిశాడంటగా?
Related tags :