Politics

ధూళిపాళ్ల నరేంద్రకు చంద్రబాబు పరామర్శ

ధూళిపాళ్ల నరేంద్రకు చంద్రబాబు పరామర్శ

ఎసిబి అక్రమ కేసు కారణంగా అరెస్టై మంగళవారం విడుదలైన సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పరామర్శించారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన నరేంద్ర ఆరోగ్య పరిస్థితిని వాకబుచేశారు. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు భయపడవద్దని యావత్ తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సంగం డెయిరీని కాపాడుకునేందుకు నరేంద్ర నేతృత్వంలో పాల ఉత్పత్తిదారులు చేసే పోరాటానికి అండగా నిలుస్తామని అన్నారు.