Movies

బాలీవుడ్ కోసం కండోమ్ పరీక్షలు

బాలీవుడ్ కోసం కండోమ్ పరీక్షలు

బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకోవడం అంత సులువైన పని కాదన్న మాట అందరికీ తెలిసిందే. అక్కడ అందర్నీ ఆకర్షించాలంటే సాహసాలు చేయాలి మరి. రకుల్‌ అదే సూత్రాన్ని నమ్ముతోంది. ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్న ఒక చిత్రంలో నటించేందుకు రకుల్‌ ఇప్పటికే సంతకం చేసింది. డైరెక్టర్‌ తేజాస్‌ డోస్కర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్‌సింగ్‌ ఒక కండోమ్‌ టెస్టర్‌గా పనిచేసే యువతి పాత్రలో కనిపించనుందట. దీనికి సంబంధించి జోరుగా చర్చలు సాగుతున్నాయి. అయితే.. దీనిపై నేరుగా స్పందించలేదు. సమాజంలో నెలకొన్న కొన్ని సమస్యలను సున్నితంగా చెప్పాల్సిన అవసరం ఉందంటూ తన పాత్ర గురించి చెప్పకనే చెప్పింది. ‘ఇక నుంచి అన్నిరకాల పాత్రలు చేసేందుకు సిద్ధంగా ఉన్నా. సమాజంలో ఉన్న కొన్ని సమస్యలను సున్నితంగా ప్రపంచానికి చూపించాల్సిన అవసరం ఉంది’ అని రకుల్‌ చెప్పింది. ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో మొదలయ్యే అవకాశాలున్నాయని ఆమె తెలిపింది. ఇటీవల ఓటీటీలో విడుదలైన ‘సర్దార్‌ కా గ్రాండ్‌ సన్‌’ చిత్రంలో ఆమె నటించింది. హిందీలో ఆమె ‘ఎటాక్‌’, ‘మే డే’, ‘థాంక్‌ గాడ్‌’తో పాటు ‘ఇండియన్‌2’ చిత్రాల్లో నటిస్తోంది.