* నిత్యావసరాల ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వంట నూనె సామాన్యుడి నడ్డి విరుస్తోంది. ఈ విషయాన్ని పౌర సరఫరాల శాఖల లెక్కలు ధృవీకరిస్తున్నాయి. దశాబ్దకాలంగా ఎన్నడూ లేనంత వ్యత్సాలతో వంట నూనె అధిక ధరకు చేరుకుంది. కరోనా, లాక్డౌన్ ఎఫెక్ట్‌తో వంట నూనె ధరలు మరింత పెరగడానికి కారణాలని గణాంకాలు చెప్తున్నాయి. దేశంలో ఎక్కువగా వాడుతున్న ఎడిబుల్ ఆయిల్ ప్యాకెట్స్ ధర సగటున మే నెలలో బాగా పెరిగిందని, గత పదకొండేళ్లలో ఇదే ఎక్కువని తెలుస్తోంది. పల్లీ, ఆవ, వనస్పతి, సోయా, సన్‌ఫ్లవర్, పామ్.. ఇలా దాదాపు ప్రతీ ఆయిల్ మీద ప్రభావం పడిందని అఫీషియల్ డేటా వెల్లడించింది. ముఖ్యంగా కరోనా మధ్యకాలంలో లాక్డౌన్ల వల్ల రాష్ట్రాల మధ్య ఆర్థిక లావాదేవిలకు విఘాతం కలగడం కూడా వంట నూనె ధరలు పెరగడానికి ఒక కారణంగా ఆ డేటా వెల్లడించింది.
* త్వరలో హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా ద్విచక్ర వాహనాలకు బ్లూటూత్ సౌకర్యం కల్పించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి రోడ్‌సింక్ పేరుతో ట్రేడ్‌మార్క్‌కు మార్చిలో దరఖాస్తు చేసుకుంది. ఇప్పుడు దానికి ఆమోదం లభించింది. ఇది హోండా సొంతగా అభివృద్ధి చేసిన యాప్. ఇది వాయిస్ కంట్రోల్ విధానంతో పనిచేస్తుంది. ఇప్పటికే హోండా H’Ness CB 350 బైకులో ఇలాంటిదే వినియోగిస్తున్నారు. ఇది బ్లూటూత్ కనెక్షన్ ఆధారంగా పనిచేస్తుంది.
* బుధవారం బంగారం ధర భారీగా పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.527 పెరిగి, రూ.48,589కు చేరింది. నిన్న 10గ్రాములు రూ.48,062 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. పసిడి బాటలోనే వెండి కూడా పయనించింది. కిలోపై రూ.1,043 పెరగడం ద్వారా రూ.71,775కు చేరింది.
* నూతన ఐటీ నిబంధనలు అమలులోకి వచ్చిన నేపథ్యంలో సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ ట్విట్టర్, ఫేస్‌బుక్‌లపై కేంద్రం నిషేధం విధిస్తుందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో నెటిజన్లు గతంలో మంచి రోజులను గుర్తు చేసుకుంటున్నారు. గతంలో వాడి వదిలేసిన ప్లాట్‌ఫామ్.. అర్కూట్‌కు సంబంధించి మీమ్స్ షేర్ చేస్తున్నారు.