ఫెదరర్, నాదల్కు మధ్య గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల సంఖ్యలో చాలా వ్యత్యాసం ఉండేది. 2003లో తొలి గ్రాండ్‌స్లామ్ విజయాన్ని అందుకున్న ఫెదరర్.. అక్కడి నుంచి తిరుగులేని ఆటతో ఆధిపత్యం చలాయించాడు. 2005లో గ్రాండ్‌స్లామ్‌లో మొదటి టైటిల్ గెలుపు రుచి చూసిన నాదల్ మరోవైపు నుంచి దూసుకొచ్చాడు. అయినప్పటికీ 2009లో 15వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో పీట్ సంప్రాస్ (14 టైటిళ్లు) రికార్డును ఫెదరర్ చెరిపేసే సమయానికి.. నాదల్ సాధించిన టైటిళ్ల సంఖ్య 6 మాత్రమే. కానీ ఆ తర్వాత గాయాలు, ఇతర కారణాలతో ఫెదరర్ కెరీర్ కాస్త నెమ్మదించగా.. ఆ అవకాశాన్ని అందుకున్న నాదల్ విజయాలతో సాగాడు. కానీ 2017కు ముందు వరకూ ఫెదరర్ కంటే నాదల్ మూడు టైటిళ్లు వెనకే నిలిచాడు. కానీ ఆ తర్వాత మూడేళ్లలో ఫెదరర్ మూడు టైటిళ్లు గెలిస్తే.. నాదల్ ఏకంగా అయిదు సార్లు విజేతగా నిలిచాడు. ఇక గతేడాది ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గడం ద్వారా పదకొండేళ్లకు పైగా గ్రాండ్‌స్లామ్ టైటిళ్లలో ఫెదరర్ సాగించిన ఆధిపత్యానికి గండి కొట్టాడు. ఈ సారి అదే ఎర్రమట్టి కోర్టులో మరోసారి విజేతగా నిలిచి అతణ్ని దాటుతాడేమో చూడాలి. పురుషుల సింగిల్స్‌లో ఫెదరర్, నాదల్, జకోవిచ్‌దే పెత్తనమైనప్పటికీ దిగ్గజంగా మాత్రం ఎక్కువ మంది ఫెదరర్‌నే పేర్కొంటారు. కానీ ఇప్పుడతణ్ని దాటేందుకు నాదల్ ఒక్క టైటిల్ దూరంలో ఉన్నాడు. ఈ సారి రొలాండ్ గారోస్‌లో సరికొత్త చరిత్ర నమోదవుతుందా? లేదా? ఆ ఘనత కోసం నాదల్ మరికొంత కాలం ఎదురు చూడాల్సి వస్తుందా? అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.
ఆ రికార్డు నాదల్ అందుకుంటాడా?
Related tags :