సియాటెల్‌లో జరుగుతున్న తానా 2021 ఎన్నికల్లో 10877 బ్యాలెట్ కవర్లను తెరిచే ఘట్టం ముగిసింది. బ్యాలెట్ కవర్‌ను, బ్యాలెట్‌ను సరిచూసే ప్రక్రియ కూడా ముగిసినట్లు సమాచారం. ప్రస్తుతానికి కేవలం ఒకే మెషీన్‌పై బ్యాలెట్లను లెక్కబెడుతున్నారు. తుది బ్యాలెట్ల సంఖ్య తుది ఫలితాల వరకు తెలియకపోవచ్చు. 1300 బ్యాలెట్లను మెషీన్లు చదవలేని కారణంగా మనుషులచే లెక్కింపు చేపడుతున్నారు. ఈ మొత్తం తతంగం పూర్తి కావడానికి చికాగో/డల్లాస్ కాలమానం ప్రకారం రాత్రి 9:30 కావచ్చునని అంచనా. డల్లాస్ సమయం 7:30గంటలకు 4183 బ్యాలెట్లు లెక్కింపు పూర్తి కాగా, మరో 17వేల వరకు ఉన్నట్లు సమాచారం.
తానా బ్యాలెట్ల కౌంటింగ్-సాయంకాల పరిస్థితి ఇది
Related tags :