* ఏకొండూరు మం విస్సన్నపేట రోడ్డు చైతన్య నగర్ గ్రామం సమీపంలో రోడ్డుప్రమాదం.అదుపుతప్పి మోటార్ సైకిల్ పై దూసుకొచ్చిన కారు.మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తున్న దంపతులు అక్కడి అక్కడే మృతి .భరోతు సొంల్లు వయస్సు -45 భరోతుకోటేశ్వరమ్మ-40.మృతులు ఏ. కొండూరు మండలం కుమ్మరికుంట్ల వాసులుగా గుర్తింపు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
* జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ డీఈ అవినీతి నిరోధక శాఖ(అ.ని.శా) అధికారులకు చిక్కారు. స్వీపర్ నుంచి లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డారు. ఇటీవల జీహెచ్ఎంసీ మహిళా స్వీపర్ సాలెమ్మ అనారోగ్యంతో మృతిచెందారు. ఆమె ఉద్యోగం భర్తకు ఇచ్చేందుకు డీఈ మహాలక్ష్మి లంచం అడిగారు. మల్లాపూర్‌లోని ఓ హోటల్లో రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఆమె అ.ని.శాకు చిక్కారు. *ఈ నేపథ్యంలో డీఈ మహాలక్ష్మి నివాసంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
* రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌కూ సైబర్ నేరగాళ్ల బాధ తప్పలేదు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ‘డీజీపీ ఆంధ్రప్రదేశ్’ పేరిట ట్విటర్లో ఆదివారం ఓ నకిలీ ఖాతాను ప్రారంభించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ చిత్రాన్ని ఆ ఖాతాకు డీపీగా పెట్టారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ అధికారిక ఖాతా ఇది అని ట్విటర్ హ్యాండిల్లో పేర్కొన్నారు. వరుసగా పలు ట్వీట్లు చేశారు. నకిలీ ఖాతా అనే విషయం గుర్తించకముందు పలు జిల్లాల ఎస్పీలు, ఇతరులు ఈ ట్విటర్ ఖాతాను అనుసరించారు.
* కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి సమీపంలో ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన పేరుబోయిన సాయి (22), అదే గ్రామానికి చెందిన బాలిక (14) ప్రేమించుకున్నారు. వీరిద్దరూ శనివారం నుంచి ఇంటి వద్ద కనిపించలేదు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు సమీప గ్రామాల్లో విచారించగా ప్రేమికులిద్దరూ పెదకళ్లేపల్లి వద్ద చెట్టుకు ఉరివేసుకున్నట్లు తెలియడంతో అక్కడి వెళ్లి పరిశీలించారు. ఇరువురి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చల్లపల్లి ఎస్సై నాగరాజు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.
* మరోసారి రెచ్చి పోయిన బెజవాడ గ్యాంగ్ లో ప్రధాన నిందితుడు మణికంఠ అలియాస్ పండు.కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి స్నేహితుడుకు పుట్టిన రోజు పార్టీ ఇచ్చిన పండు.పార్టీ ఇచ్చిన తరువాత పండు గ్యాంగ్ స్నేహితుడు పై కత్తులు, కర్రలతో దాడి.ప్రాణభయంతో బోరున విలపించిన కర్రలతో చితకబాదిన పండు.తనను వదిలైయండి… అంటు ఎంత వేడుకున్న వదలని పండు గ్యాంగ్.గడచిన ఏడాది లాక్ డౌన్ ఉన్న మార్చి నెలలో పండు, తోట సందీప్ వర్గాల మధ్య గ్యాంగ్ వార్.మారణాయుధాలతో చేసుకున్న దాడుల్లో చనిపోయిన సందీప్.అప్పట్లో పండుతోపాటు 40 మందిపై రౌడీ షీట్ తెరిచిన పోలీసులు.పండు ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పెనమలూరు పోలీసులు.