5జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా బాలీవుడ్ సీనియర్ నటి జూహీచావ్లా దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. శుక్రవారం పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు 5జీ టెక్నాలజీ వద్దన్న ఆమె విజ్ఞప్తిని తిరస్కరించింది. టెక్నాలజీ అప్‌గ్రేడ్ కావాల్సిందేనని స్పష్టీకరించింది. అయితే, కోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు జూహీ అభిమాని సినిమా పాటలు వినిపించటం.. ప్రొసీడింగ్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు కోర్టు ఆమెపై సీరియస్ అయింది. రూ.20లక్షల పెనాల్టీ వేసింది. కోర్టును ఆశ్రయించేకంటే ముందు ప్రభుత్వానికి ఈ విషయమై లేఖ రాయాల్సిందని అభిప్రాయపడింది. పిటిషన్లో బలం లేదని, అనవసరంగా దాఖలు చేశారని పేర్కొంది.
పాటలు పెట్టినందుకు ₹20లక్షల జరిమానా
Related tags :