మనం ఏం పని చేయాలన్నా మన వెన్నెముక సహకరించాలి. బరువులు ఎత్తాలన్నా, వంగి పనిచేయాలన్నా, సరిగా కూర్చోవాలన్నా వెన్నెముక దృఢంగా ఉండాలి. అయితే మారిన మన జీవన శైలి, అలవాట్లు రోజువారి భంగిమల మూలంగా వెన్నెముకపై ఒత్తిడి పెరిగి రోజు రోజుకూ బలహీనంగా మారుతోంది. చాలామందిలోని వెన్నులోని డిస్కులు పక్కకు జారిపోతున్నాయి. దీంతో పక్కన ఉన్న నరాలపై ఒత్తిడి పెరిగి నడుము నొప్పితో బాధపడుతుంటారు. అయితే ఈ నడుమునొప్పిని తగ్గించుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన యోగాసనాలు సాధన చేస్తుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం చాలామందిని డిస్క్ ప్రొలాప్స్ సమస్య వేధిస్తోంది. దీని వల్ల విపరీతమైన వెన్ను నొప్పి వస్తుంటుంది. ఈ నొప్పి కూర్చోనివ్వదు, నిలబడనివ్వదు. పడుకుంటే మాత్రం కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది. కొంతమందిలో ఎన్ని మందులు వాడినా తగ్గక పోవడంతో మానసిక క్షోభతో బాధపడుతుంటారు. అలాంటి వాళ్లు యోగా చేయడం ద్వారా 80 నుంచి 90 శాతం ఉపశమనం పొందుతున్నారని నిపుణులు చెబుతున్నారు. అలాగే వెన్నునొప్పి తగ్గించడానికి సేతుబంధాసనం, మేరు దండ ముద్ర ఎంతో ఉపయోగపడుతుంది.
వెన్ను నొప్పి తగ్గించే యోగాసనాలు
Related tags :