Politics

నరేంద్రకు నోటీసులు-నేరవార్తలు

నరేంద్రకు నోటీసులు-నేరవార్తలు

* మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో నేటి నుంచి మళ్లీ విచారణ…కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహాం చేరుకున్న 6 మంది సీబీఐ అధికారుల బృందం…ఇప్పటికే పలు దపలుగా మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సీబీఐ విచారణ..నేడు మరోసారి పలువురు కీలక వ్యక్తులను విచారించే అవకాశం.

* దెందులూరు మాజీ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మరియు మాజీ జెడ్ పి పి చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు పై నిన్న సోషల్ మీడియాలో పెట్టిన అనుచిత పోస్ట్ లపై ఈరోజు జిల్లా ఎస్.పి గారికి మరియు జిల్లా కలెక్టర్ గారికి ఏలూరు పార్లమెంటు తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో ఏలూరు పార్లమెంటు తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులుగారు మరియు చింతమనేని ప్రభాకర్ గారు పిర్యాదు చేసినారు. బాద్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

* సంగం డెయిరి కేసులో ఈరోజు ఉదయం 9గంటలకు విచారణకు హజరుకావాలని ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ కు నోటీసులు.

* పాకిస్తాన్‌లో ఘోర ప్రమాదం.._ రెండు రైళ్లు ఢీకొని 30 మంది దుర్మరణం..పాకిస్తాన్‌లో సోమవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది.ప్రయాణికులతో వెళ్తున్న రెండు రైళ్లు ఢీకొని.. దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.సింధ్ ప్రావిన్స్ లోని ఘోట్కీ రేతి, ధహర్కి రైల్వే స్టేషన్‌ మధ్య సర్‌ సయ్యద్‌ ఎక్స్‌ప్రెస్‌ – మిల్లట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఒకదానికొకటి ఢీ కొనడంతో ఈ ఘోరం చోటుచేసుకుంది.లాహోర్ నుంచి కరాచీకి వెళ్తున్న సర్ సయేద్ ఎక్స్ ప్రెస్‌ను.. కరాచీ నుంచి సర్గోధాకు వెళ్లే మిల్లట్ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొంది.ఈ ఘటనలో 13నుంచి 14 బోగిలు పట్టాలు తప్పినట్లు సమాచారం.