కాజల్ అగర్వాల్ హిందీలో ఓ చిత్రం అంగీకరించారు. పెళ్లి నేపథ్యంలో రూపొందనుంది. ఓ పెళ్లి ఇంట ఉమ అనే ఆమ్మాయి వచ్చిన తార్వత ఏం జరిగింది. అసలు ఉమ ఏం చేసింది? అనేది చిత్రకథ. ఉమ పాత్రలో కాజల్ కనిపించనున్నారు. ఆమె పాత్ర పేరునే సినిమా టైటిల్ ‘ఉమ’గా నిర్ణయించారు. ‘‘నటిగా నాకు సవాల్ విసరడంతో పాటు వినోద్మాతక కథల్లో నటించడాన్ని నేనెప్పుడూ ఇష్టపడతా. ‘ఉమ’ అటువంటి కథే. పరిస్థితులు సాధారణస్థితికి వచ్చిన తర్వాత చిత్రీకరణ ప్రారంభించాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని కాజల్ అన్నారు. పెళ్లి తర్వాత ఆమె అంగీకరించిన తొలి హిందీ చిత్రమిది. తథాగతా సింఘా దర్శకుడిగా పరిచయవుతున్నారు. ఈ చిత్రానికి అవికేష్ ఘోష్ నిర్మాత. ప్రముఖ దర్శకుడు సుజోయ్ ఘోష్ క్రియేటివ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. లాక్డౌన్ తర్వాత కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, సెట్స్ మీదకు తీసుకు వెళతామని నిర్మాత తెలిపారు.
ఉమ వచ్చాక ఏదో జరుగుతుంది
Related tags :