విజయ్ ఆంటోనీ హీరోగా వచ్చిన చిత్రం ‘కొలైక్కారన్’ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు కథానాయికగా పరిచయమైన తార అషిమా నర్వాల్. ఈ చిత్రం తర్వాత ఆమె తమిళంలో రాజభీమా అనే చిత్రంలో నటించింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కారణంగా చిత్ర పరిశ్రమ స్తంభించిపోయింది. దీంతో నటీనటులు తమతమ గృహాలకే పరిమితమయ్యారు. అదేసమయంలో కొత్త చిత్రాల కథలు వింటూ ఆ చిత్రాల్లో నటించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా పలువురు హీరోయిన్లు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. పనిలోపనిగా ప్రత్యేక ఫొటో షూట్లు నిర్వహిస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అషీమా.. తాజాగా పోస్టు చేసిన ఫొటోలను చూస్తే సినిమాల్లో కథ డిమాండ్ చేసిన పక్షంలో గ్లామర్ పాత్రల్లో కూడా నటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పకనే చెబుతున్నాయి.
హింట్ ఇస్తంది
Related tags :