Devotional

కాశ్మీర్‌లో తితిదే ఆలయానికి భూమిపూజ

కాశ్మీర్‌లో తితిదే ఆలయానికి భూమిపూజ

కశ్మీర్‌లో టీటీడీ ఆలయ నిర్మాణానికి జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్‌ మనోజ్ సింహా ఆదివారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయమంత్రి కిషన్‌రెడ్డి, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్‌ నేత రాంమాధవ్‌ పాల్గొన్నారు. దేవాలయం కోసం లీజు ప్రాతిపదికన 62 ఎకరాలను జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం కేటాయించింది. రూ.33.52 కోట్ల వ్యయంతో 18 నెలల్లో దేవాలయ నిర్మాణం పూర్తికానుంది. దేవాలయ ప్రాజెక్ట్‌లో భాగంగా వేద పాఠశాల, భక్తులకు వసతి సదుపాయాలు కల్పించనున్నారు.