NRI-NRT

కోవాగ్జిన్ తీసుకున్న విద్యార్థులకు అమెరికా గుడ్‌న్యూస్ -TNI కోవిద్ బులెటిన్

కోవాగ్జిన్ తీసుకున్న విద్యార్థులకు అమెరికా గుడ్‌న్యూస్ -TNI కోవిద్ బులెటిన్

* రాష్ట్రంలో కొవిడ్ కారణంగా తల్లిదండ్రుల్ని కోల్పోయి 119 మంది చిన్నారులు అనాథలుగా మారినట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లాలో 16 మంది, నెల్లూరు, విశాఖల్లో 13 మంది చొప్పున చిన్నారులు అమ్మానాన్నల్ని పోగొట్టుకున్నారని పేర్కొంది.

* కరోనా నుంచి కోలుకున్న మరో 10,567 మంది బాధితులు.రాష్ట్రంలో కొత్తగా 5,741 కరోనా కేసులు, 53 మరణాలు.రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న మరో 10,567 మంది బాధితులు.రాష్ట్రంలో ప్రస్తుతం 75,134 కరోనా యాక్టివ్‌ కేసులు.రాష్ట్రంలో 24 గంటల్లో 96,153 మందికి కరోనా పరీక్షలు.

* 60వేలకు తగ్గిన కేసులు.95.43 శాతానికి చేరిన రికవరీ రేటు.దిల్లీ: దేశంలో కరోనా కేసులు మరింత తగ్గుముఖం పట్టాయి.సోమవారం 17,51,358 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 60,471 మందికి పాజిటివ్‌గా తేలింది.గత కొద్ది రోజులుగా లక్ష దిగువనే నమోదవుతోన్న కేసులు నిన్న మార్చి 31నాటి కనిష్ఠానికి చేరాయి.గత కొద్ది రోజులుగా పలు రాష్ట్రాలు మరణాల లెక్కను సవరిస్తుండటంతో వాటి సంఖ్యలో పెరుగుదల కనిపించింది.అయితే నిన్న మూడువేల దిగువనే మరణాలు నమోదవడం ఊరట కలిగిస్తోంది.గత 24 గంటల వ్యవధిలో 2,726 మంది మృత్యుఒడికి చేరుకున్నారు.ప్రస్తుతం దేశంలో మొత్తం కేసులు 2.9కోట్లకు పైబడగా 3.7లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.అలాగే దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 38కోట్లకుపైగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.

* కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి సమయంలో దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో తీవ్ర ఆక్సిజన్‌ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు పీఎం కేర్స్‌ నిధులతో దేశవ్యాప్తంగా 850 ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు డీఆర్‌డీఓ వెల్లడించింది.

* ఇప్పటి వరకు కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న విద్యార్థులను అనుమతించని అమెరికా ఇప్పుడు సడలింపులు ఇచ్చింది. కోవాగ్జిన్‌ టీకా తీసుకున్న విద్యార్థులకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది.