Movies

ఎన్.టి.ఆర్‌కు విలన్

ఎన్.టి.ఆర్‌కు విలన్

‘ఉప్పెన’ చిత్రంలో ప్రతినాయకుడిగా చక్కటి నటనతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు తమిళ అగ్ర హీరో విజయ్‌ సేతుపతి. తాజాగా ఆయన తెలుగులో మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా రూపొందనుంది. ఈ చిత్రంలో నెగిటివ్‌ షేడ్స్‌తో కూడిన విలక్షణ పాత్రలో విజయ్‌ సేతుపతి కనిపించబోతున్నట్లు సమాచారం. కొత్తదనం కలబోతగా శక్తివంతంగా దర్శకుడు తన పాత్రను తీర్చిదిద్దిన తీరు నచ్చడంతో ఆయన ఈ సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు చెబుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నది.