కరోనా విజృంభిస్తున్న వేళ.. అందరి జాగ్రత్తలూ దీనిపైనే. అందరి మాటలూ వీటిని పెంచుకోవడం ఎలా అనేదానిపైనే. ఆక్సిజన్ మన శరీర కణాల్లో శక్తిని పెంచుతుంది. తద్వారా రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. దీనికి బలవర్ధకమైన ఆహారం తీసుకోవడమే మార్గం. రెడ్ బ్లడ్ సెల్స్ (ఆర్బీసీ)లోని ప్రధాన ప్రొటీన్ హిమోగ్లోబిన్. ఇది ఊపిరితిత్తులనుంచి ఆక్సిజన్ (ఓ2)ను వివిధ శరీర అవయవాలకు సరఫరా చేయడంతోపాటు అక్కడినుంచి కార్బన్‌డైయాక్సైడ్ (సీఓ2)ను వెనక్కు తీసుకొని వస్తుంది. ఈ ఆక్సిజన్ కణాల్లో శక్తిని తయారుచేసేందుకు తోడ్పడుతుంది. అందుకే శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ సరిగ్గా ఉంచుకోవాలనుకుంటే హిమోగ్లోబిన్‌ను పెంచే ఆహార పదార్థాలు తినడం ఎంతో ముఖ్యం. పురుషులకు సుమారు 13.5 గ్రాములు/ డెసీ లీటర్లు, మహిళలకు 12 గ్రాములు/ డెసీ లీటర్ల హిమోగ్లోబిన్ అవసరమని డాక్టర్లు చెప్తున్నారు. హార్వర్డ్ హెల్త్, అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం….శరీరంలో హిమోగ్లోబిన్ తగినంత పాళ్లలో మెయింటెయిన్ చేయాలంటే కాపర్, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ బీ2 (రైబోఫ్లెవిన్), విటమిన్ బీ3 (నియాసిన్), విటమిన్ బీ5, విటమిన్ బీ 6, ఫాలిక్ యాసిడ్, విటమిన్ బీ12 తీసుకోవడం తప్పనిసరి. ఆహారంలో ఈ న్యూట్రియెంట్స్ ఉండటం వల్ల రక్తంలో ఆక్సిజన్ లెవల్స్ (Oxygen Levels) పెరుగుతాయి.
ఆక్సిజన్ స్థాయి పెరగాలంటే ఇవి తినండి
Related tags :