* స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేసిన కరోనా మెడికల్ కిట్లలో మద్యం సీసాలు ఉండడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహబూబాబాద్ నియోజకవర్గంలోని క్యాంపు ఆఫీసులో ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ గురువారం ఎమ్మెల్సీ తరఫున కరోనా మెడికల్కిట్టును ప్రజాప్రతినిధులకు పంపిణీ చేశారు. జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులకు వీటిని అందజేశారు. కొందరు శుక్రవారం కిట్టును పరిశీలించగా అందులో టీచర్స్ లిక్కర్ బాటిల్ ఉండటంతో అవాక్కయ్యారు. కొందరు హర్షం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు.మద్యం సీసాలు పంపడం ప్రజాప్రతినిధుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని ఎంపీటీసీల ఫోరం లీడర్వాసుదేవురెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
* తెలంగాణలో లాక్ డౌన్ ను సంపూర్ణంగా ఎత్తివేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కరోనా కేసుల సంఖ్య పూర్తి స్థాయిలో తగ్గుముఖం పడుతున్న నేపధ్యంలో కేబినెట్ ఈ మేరకు లాక్ డౌన్ ను ఎత్తివేస్తూ నిర్ణయం కుంది. లాక్ డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ ఆదేశించింది.
* దేశంలో కరోనా థర్డ్ వేవ్ అనివార్యమని, ఆరు నుంచి 8 వారాల్లో థర్డ్ వేవ్ వస్తుందని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) అధిపతి డాక్టర్ రణ్ దీప్ గులేరియా అన్నారు. లాక్ డౌన్ ఆంక్షలు సడలించాక ప్రజలెవరూ నిబంధనలను పాటించట్లేదన్నారు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ నుంచి ప్రజలెవరూ ఇంకా గుణపాఠం నేర్చుకోనట్టున్నారన్నారు. ఇప్పుడు కూడా జనం గుమికూడుతున్నారని, భౌతిక దూరం, మాస్క్ వంటి నిబంధనలేవీ పట్టించుకోవట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని నియంత్రించడంపైనే థర్డ్ వేవ్ ఆధారపడి ఉందన్నారు.
* ముషీరాబాద్ పరిధిలో కరోనా మహమ్మారి సమయంలో సమాజానికి అంకితభావంతో సేవలందించే ఆశావర్కర్ల సేవలు ఎవరు లేరని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు హైదరాబాద్ జవహర్ నగర్ లోని కమ్యూనిటీ హాల్ లో ఆశా వర్కర్లకు నిత్యావసర సరుకులను డాక్టర్ కే లక్ష్మణ్ తో పాటు గాంధీ నగర్ డివిజన్ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ పంపిణీ చేశారు దేశంలోని 27 కోట్ల మంది ప్రజలకు ప్రప్రథమంగా ఉచితంగా వ్యాక్సిన్ చేసిన ఘనత నరేంద్ర మోడీకి దక్కుతుందని అని ఆయన అన్నారు ప్రపంచంలో పెద్ద దేశంగా ఉన్న అమెరికాలో సైతం ఇంత భారీ ఎత్తున ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ జరగలేదన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజల ఆరోగ్యం కోసం నిర్మాణాత్మక కార్యక్రమాన్ని చేపడుతున్నారని ఆ కార్యక్రమాలను జీర్ణించుకోలేక కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని పార్టీ శ్రేణులు అన్నారు.
* దేశంలో కరోనా ఉద్ధృతి అదుపులోకి వస్తోంది. శుక్రవారం 19,02,009 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 60,753 మందికి పాజిటివ్‌గా తేలింది. గత ఐదు రోజులుగా రోజువారీ కేసులు 60వేల మార్కు వద్దే నమోదవుతున్నాయి. తాజాగా 1,647 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. క్రితంరోజుతో పోల్చితే మృతుల సంఖ్యలో కొద్దిగా పెరుగుదల కనిపించింది. ప్రస్తుతం మొత్తం కేసులు 2.98కోట్లకు చేరగా..3,85,137 మంది ప్రాణాలు కోల్పోయారు. క్రియాశీల కేసులు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం 7,60,019 మంది కొవిడ్‌తో బాధపడుతుండగా క్రియాశీల రేటు 2.55 శాతానికి తగ్గింది. నిన్న 97,743 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 2.86కోట్ల మంది వైరస్ నుంచి బయటపడ్డారు.