Videos

కమలాన్ని కప్పేసిన గులాబీ పరిమళం

కమలాన్ని కప్పేసిన గులాబీ పరిమళం

గులాబీ పార్టీతో రెండు దశాబ్దాల అనుబంధం.. కష్టంగానే తెంచుకున్న బంధం.. తెలంగాణ ఆత్మగౌరవ నినాదంతో సరికొత్త బాట పట్టిన వైనం.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ కాషాయ కండువా కప్పుకుని టీఆర్ఎస్‌కు దీటైన జవాబివ్వాలన్న తలంపుతో పని చేస్తున్నారు. తన రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ ఉపఎన్నికకు సిద్ధమయ్యారు. అయితే ఆయనను ఇంకా పాత వాసనలు వదల్లేనట్టుంది. శనివారం జరిగిన ఓ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. గులాబీ జెండా ఎగరేస్తాం అంటూ టంగ్ స్లిప్ అయ్యారు. అయితే వెంటనే తేరుకున్న ఈటల.. కాషాయ జెండా అంటూ సర్దుకున్నారు. పక్కనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉండటం ఇది మరింత హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.