పుచ్చకాయ తియ్యగా ఉండటం వల్ల దీన్ని తినొచ్చా లేదా అని చాలామందికి ఓ సందేహం ఉంటుంది. అయితే పుచ్చకాయ విషయంలో ఆ భయం అక్కర్లేదు. ఎందుకంటే ఆయా ఆహార పదార్థాల్లోని గ్లూకోజ్ రక్తంలో ఎంత వేగంగా కలుస్తుందనేదాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్(జీఐ)తో సూచిస్తారు. ఇది అధికంగా ఉండే పండ్ల విషయంలో డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పుచ్చకాయలో జీఐ 72 శాతం ఉంటుంది. కానీ ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండి పిండిపదార్థం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి పుచ్చకాయ తిన్నప్పుడు వెంటనే గ్లూకోజ్ పెరిగినప్పటికీ వెంటనే తగ్గిపోతుంది. కాబట్టి నిరభ్యంతరంగా పుచ్చకాయను తినొచ్చు.
మధుమేహులు పుచ్చకాయ తినవచ్చా?
Related tags :