రాష్ట్ర జనాభా 2019లో సుమారు 3.72 కోట్లు ఉండొచ్చని కేంద్ర జనగణన విభాగం పేర్కొన్నది. ఆ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు నమోదైన జనన, మరణాల ఆధారంగా తాజాగా జనాభా నివేదికను విడుదల చేసింది. 2019 చివరినాటికి దేశ జనాభా దేశ 133.89 కోట్లుగా పేర్కొన్నది. ఆ ఏడాది 2.67 కోట్ల మంది జన్మించారని, 83 లక్షల మంది దాకా మరణించి ఉంటారని అంచనా వేసింది. దేశవ్యాప్తంగా 1.65 లక్షల మంది నవజాత శిశువులు మరణించినట్టు తెలిపింది. మొత్తం మరణాల్లో ఇది 2.2 శాతంగా పేర్కొన్నది. తెలంగాణలో ఆ ఏడాది 8.41 లక్షల మంది జన్మించారని, 2.34 లక్షల మంది మరణించారని పేర్కొన్నది. రాష్ట్రంలో ప్రతి గంటకు 96 మంది పిల్లలు జన్మించారు. అదేసమయంలో సుమారు 27 మంది మరణించారు.
2019 నాటికి తెలంగాణా జనాభా మొత్తం ఇది
Related tags :