Movies

“మా” రేసులో జీవిత

“మా” రేసులో జీవిత

తెలుగు చిత్రసీమలో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల హడావిడి మొదలైంది. ఇప్పటికే కథానాయకుడు మంచు విష్ణు, నటుడు ప్రకాష్‌రాజ్‌ ‘మా’ అధ్యక్ష పదవి కోసం ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడీ అధ్యక్ష రేసులో నటి జీవిత కూడా పోటీ పడనున్నట్లు సమాచారం అందుతోంది. ఇందుకోసం ఇప్పటికే ఆమె ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇదే నిజమైతే ఈసారి ‘మా’ ఎన్నికల్లో త్రికోణ పోటీ చూసే అవకాశముంది. జీవిత ప్రస్తుతం ‘మా’ సెక్రెటరీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.