Movies

తాళాలు వేసిన సీ.కళ్యాణ్. పోలీసులకు ఫిర్యాదు.

తాళాలు వేసిన సీ.కళ్యాణ్. పోలీసులకు ఫిర్యాదు.

సినీ నిర్మాత సి.కల్యాణ్‌తో పాటు మరో ముగ్గురిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. అమెరికాలో నివసించే వైద్యుడు స్వరూప్ 1985లో హైదరాబాద్ షేక్‌పేటలో ఉన్న 634 గజాల స్థలాన్ని ఫిలింనగర్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ నుంచి కొనుగోలు చేశారు. అనంతరం ఆ స్థలాన్ని తన సోదరుడు గోపీకృష్ణ పేరుతో జీపీఏ చేశారు. ఈ స్థలాన్ని 2015లో నారాయణమూర్తి అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చారు. ఆయన ఇందులో ఆర్గానిక్ స్టోర్ నిర్వహిస్తున్నారు. సోమవారం సాయంత్రం శ్రీకాంత్, తేజస్వి, షరూఫ్ అనే ముగ్గురు అక్రమంగా ప్రవేశించి తాళాలు వేశారు. సినీ నిర్మాత కళ్యాణ్ సూచనల మేరకే తాళాలు వేసినట్లు వారు తెలిపారు. గోపీకృష్ణ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు 448, 506, రెడ్ విత్ 34 కింద కేసులు నమోదు చేశారు.