Politics

ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ జరపాలని పిటీషన్-తాజావార్తలు

ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ జరపాలని పిటీషన్-తాజావార్తలు

* ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి వివాదంపై తెలంగాణ హైకోర్టులో విచారణ కృష్ణా బేసిన్‌ లో విద్యుదుత్పత్తి ఆపాలంటూ కృష్ణా జిల్లా రైతులు వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది.జీవో 34 పై వేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై జస్టిస్‌ ఎంఎస్ రామచంద్రారావు, జస్టిస్‌ వినోద్‌ కుమార్‌ ధర్మాసనం విచారణ చేపట్టగా విచారణను సీజే ధర్మాసనం ఎదుట ఉంచాలని ఏజీ కోరారు.రైతుల పిటిషన్‌పై విచారణ జరపాలని సీజే తమను ఆదేశించారని జస్టిస్‌ రామచంద్రరావు ధర్మాసనం తెలిపింది.ఏజీ స్థాయి అధికారి నుంచి ఇలాంటి అసమంజస అభ్యర్థన సరికాదని పేర్కొంది.చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఎదుట విచారించాలనడం తమ ధర్మాసనంపై దాడేనని వ్యాఖ్యానించింది.

* ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ జరపాలని ఏపీ హైకోర్టులో 5 అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు.తాము ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులమని, కౌంటింగ్ జరపాలని పిటిషన్లు పేర్కొన్నారు.ఎంపీటీసీ, జడ్పీటీసీ కేసు విచారణలో తమను కూడా ఇంప్లీడ్ చేయాలని పిటిషనర్లు కోరారు. ఈ నెల 27కి హైకోర్టు విచారణ వాయిదా వేసింది.

* పుట్టపర్తి సత్యసాయి ఎయిర్ పోర్ట్‌ను పారిశ్రామిక అవసరాలకు వినియోగించే అంశంపై సత్యసాయి ట్రస్ట్‌తో చర్చించామని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ట్రస్ట్‌ వర్గాలు సానుకూలంగా స్పందించాయన్నారు.

* ఏపీ డెయిరీ ఆస్తులను అమూల్‌కి అప్పగించటంపై ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.

* విశాఖ జిల్లాలో బాక్సైట్‌ మైనింగ్‌కు ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదని పంచాయతీరాజ్‌శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.

* కృష్ణానది యాజమాన్య బోర్డుకు తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ మరో లేఖ రాశారు. ఈ నెల 9న తలపెట్టిన త్రిసభ్య కమిటీ భేటీని వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. జులై 20 తర్వాత పూర్తిస్థాయి బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. ఈ మేరకు తెలంగాణ అంశాలను అజెండాలో చేర్చాలన్నారు. ఇరురాష్ట్రాల మధ్య నీటి పంపకాలను పునః సమీక్షించాలని పేర్కొన్నారు. కృష్ణా బేసిన్‌ వెలుపలకు నీరు తరలించకుండా ఏపీ ప్రభుత్వాన్ని ఆపాలన్నారు. మరోవైపు విద్యుదుత్పత్తి ఆపాలన్న ఏపీ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు కేఆర్‌ఎంబీకి రజత్‌కుమార్‌ లేఖలో పేర్కొన్నారు.

* కోవిడ్-19 సెకెండ్ వేవ్ అనంతరం భారతదేశమంతటా దేశీయ విమాన ప్రయాణాలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ప్రజలు వ్యాక్సిన్లు వేయించుకోవడం, వివిధ రాష్ట్రాలలో సడలించిన ప్రయాణ ఆంక్షలు, తప్పనిసరి ఆర్టీ-పిసిఆర్ టెస్టులతో విమాన ప్రయాణాలపై ప్రయాణికుల ధైర్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సురక్షిత ప్రయాణ వాతావరణాన్ని కల్పిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో కోవిడ్ -19 లాక్డౌన్ సడలింపులతో, హైదరాబాద్ విమానాశ్రయం నుంచి అన్ని దేశంలోని అన్ని నగరాలకూ విమానాల సంఖ్య పెరిగింది. జూన్ నెలలో విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకల్లో పెరుగుదల నమోదైంది. జూన్ 1న కేవలం 100కు పైబడిన విమానాల నుంచి నెల రోజుల వ్యవధిలో విమానాల రాకపోకల సంఖ్య దాదాపు 100 శాతానికి పెరిగి, జూన్ 27న అత్యధికంగా 199 విమానాల రాకపోకలు జరిగాయి. జూన్ 1న సుమారు 10 వేల మంది ప్రయాణికులు ప్రయాణించగా, జూన్ 27న అది గరిష్టంగా 22 వేలను తాకింది. విమానాశ్రయం గుండా ప్రయాణించే ప్రయాణీకులు సంఖ్య నెల రోజుల్లో రెట్టింపు అయింది. జూన్ 1 – 30 తేదీల మధ్య విమానాశ్రయం నుంచి 4 లక్షల మందికి పైగా దేశీయ ప్రయాణికులు, సుమారు 35 వేల మంది అంతర్జాతీయ ప్రయాణికులు ప్రయాణించారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు దేశంలోని 42 గమ్యస్థానాలకు, 10 అంతర్జాతీయ గమ్యస్థానాలకు రాకపోకలను కలిగి ఉంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, వైజాగ్ గత నెల రోజుల్లో అతి ఎక్కువ ప్రయాణికుల వృద్ధిని నమోదు చేసిన మొదటి 5 నగరాలు. ఇదే కాలంలో ప్రయాణీకుల సంఖ్య వారీగా, ముంబై 84%తో అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. స్నేహితులు & బంధువుల సందర్శన (VFR), SME వ్యాపార ప్రయాణాలు ప్రయాణీకుల సంఖ్య పెరగడానికి ఎక్కువగా దోహదపడ్డాయి. కోవిడ్ నిబంధనల అమలుకు విమానాశ్రయ అధికారులు సర్వైలెన్స్ టీమ్‌ల సహాయంతో తెలంగాణ రాష్ట్ర పోలీసులకు సహాయం చేస్తున్నారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, ఉల్లంఘించినవారికి జరిమానాలు విధిస్తున్నారు. కోవిడ్ భద్రతా మార్గదర్శకాలను అమలు చేయడానికి GHIAL కు చెందిన 20 మంది అధికారులను ప్రత్యేక పోలీసు అధికారులు(SPO)గా నియమించారు. విమానాశ్రయంలో కోవిడ్ మార్గదర్శకాలను పాటించని ప్రయాణీకులు, సందర్శకులు, సిబ్బందికి జరిమానా విధించే అధికారం ఈ SPOలకు ఉంటుంది. టెర్మినల్‌లో ప్రయాణికులు, సిబ్బంది మాస్కులు సరిగ్గా ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని కోరుతూ నిరంతరం మూడు (ఇంగ్లీష్, తెలుగు, హిందీ) భాషలలో ప్రకటనలు చేస్తున్నారు. కోవిడ్ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై విమానాశ్రయంలోని వివిధ ప్రదేశాలలో సైనేజ్‌లను ప్రదర్శిస్తున్నారు. కోవిడ్ చర్యలపై ప్రయాణీకులకు మార్గనిర్దేశం చేయడానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం కోవిడ్ జాగ్రత్తల సమాచారం వివిధ ప్రదేశాలలో ప్రదర్శించబడుతోంది. కౌంటర్ల వద్ద రద్దీని నివారించడానికి, ప్రయాణీకులు ఇంట్లో చెకిన్ చేయమని లేదా సెల్ఫ్-చెకిన్ సౌకర్యం, సెల్ఫ్-బ్యాగ్ ట్యాగ్ సౌకర్యం లాంటి సెల్ఫ్ సర్వీస్ సదుపాయాలను ఉపయోగించుకోమని ప్రోత్సహిస్తున్నారు. విమానాశ్రయం ఫోర్‌కోర్ట్ ప్రాంతంలో, చెక్-ఇన్ హాల్స్‌లో భౌతిక దూర నిబంధనల ప్రకారం సెల్ఫ్-చెకిన్ కియోస్క్‌లను ఏర్పాటు చేసారు. టచ్-లెస్ టెక్నాలజీని కలిగిన ఈ QR కోడ్ ఫ్రెండ్లీ కియోస్కులు చెకిన్ ప్రక్రియ పూర్తి చేయడానికి సహాయపడతాయి. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులందరికీ పేపర్‌లెస్ ఈ-బోర్డింగ్ సదుపాయం ఉన్న ఏకైక విమానాశ్రయం హైదరాబాద్. కాంటాక్ట్‌లెస్ ఈ-బోర్డింగ్ ప్రక్రియ ఎలాంటి ఆటంకాలూ లేని ప్రయాణ అనుభవాన్ని ఇస్తుంది. ఇది బోర్డింగ్ కార్డుల మాన్యువల్ స్టాంపింగ్ అవసరాన్ని పూర్తిగా తొలగిస్తుంది. GMR నేతృత్వంలోని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణీకులకు సురక్షితమైన కాంటాక్ట్-లెస్ ప్రయాణ అనుభవాన్ని ఇవ్వడానికి నిరంతరం వినూత్న మార్గాల కోసం అన్వేషిస్తుంది. దీనికి అనుగుణంగా, విమానాశ్రయంలోని అన్ని ఎలివేటర్లను పుష్-బటన్ కంట్రోల్ నుండి సురక్షితమైన టచ్-లెస్ ఎలివేటర్లుగా మార్చారు. ఇన్‌ఫ్రారెడ్ టెక్నాలజీపై ఆధారపడిన ఈ టెక్నాలజీలో ఎలివేటర్ బటన్ తాకే అవసరం లేకుండా 0.1-10 సెంటీమీటర్ల దూరం నుంచే ఆపరేట్ చేయవచ్చు. క్యూ మేనేజ్మెంట్ సొల్యూషన్‌తో విమానాశ్రయంలో కార్యాకలాపాలను మెరుగుపరిచేందుకు, రద్దీని తగ్గించేందుకు GHIAL ఒక పైలట్ ప్రాజెక్టులో కూడా పాల్గొంటోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా వీడియో అనలిటిక్స్ సహాయంతో విమానాశ్రయ భద్రత మరింత పెరుగుతుంది. ఈ ప్రత్యేకమైన క్యూ నిర్వహణ వ్యవస్థ ప్రస్తుత కోవిడ్ మహమ్మారి కాలంలో సురక్షిత ప్రయాణానికి దోహదపడుతుంది.

* హఫీజ్పేట్ భూములపై సుప్రీం కోర్టులో విచారణ..భూములను యథాతథ స్థితిలో కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశం..హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టుకు వెళ్లిన తెలంగాణ ప్రభుత్వం..వారం రోజుల క్రితమే మరో స్పెషల్ లీవ్ పిటిషన్ ని అనుమతిస్తూ సర్వే నెంబర్ 80 లో సి కళ్యాణ్ తో పాటు మరికొందరికి టైటిల్ లేదని లేని టైటిల్ భూమిలో ఎలా నిర్మాణాలు చేపడతారని సుప్రీం కోర్టు ఆగ్రహం.

* కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌కు ఏపీ సీఎం జగన్‌ లేఖ.కృష్ణా జలాలపై తెలంగాణ నిబంధనలు ఉల్లంఘిస్తోందని ఫిర్యాదు.తెలంగాణలోని అక్రమ ప్రాజెక్టులు తొలుత సందర్శించాలి: ఏపీ సీఎం.ఆ తర్వాతే రాయలసీమ లిఫ్ట్ సందర్శించాలని కోరిన ఏపీ సీఎం జగన్‌.తెలంగాణ ప్రాజెక్టులను ముందు పరిశీలించేలా కేఆర్ఎంబీని ఆదేశించాలి: జగన్ కేఆర్‌ఎంబీ సూచనలను తెలంగాణ పదేపదే ఉల్లంఘిస్తోంది.తెలంగాణ వైఖరితో ఏపీ తన వాటా జలాలను కోల్పోతోంది.తెలంగాణ వైఖరితో కృష్ణా జలాలు సముద్రంలో కలుస్తున్నాయి.శ్రీశైలం లో 834 అడుగుల కన్నా తక్కువున్నా విద్యుదుత్పత్తి చేస్తున్నారు.జూన్ 1 నుంచి విద్యుదుత్పత్తికి తెలంగాణ 19 టీఎంసీలు వాడింది.తెలంగాణ ఇలాగే వ్యవహరిస్తే శ్రీశైలం నిండడం దాదాపు అసాధ్యం.