NRI-NRT

రేవంత్‌రెడ్డికి డాలస్ ప్రవాసుల అభినందన

రేవంత్‌రెడ్డికి డాలస్ ప్రవాసుల అభినందన

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి నియామకం పట్ల డాలస్ ఎన్నారైలు హర్షం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టడంతెలంగాణ రాజకీయాల్లో కీలక ఘట్టంగా తెలంగాణ ఎన్నారైలు అభిప్రాయపడ్డారు. శుక్రవారం డాలస్‌లో జరిగిన అభినందన సభలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోపాటు పార్టీలకు అతీతంగా పెద్దసంఖ్యలో ఎన్నారైలు పాల్గొని రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. బడుగు బలహీన వర్గాల గొంతుకగా…రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రేవంత్ రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్కలు జూమ్ ద్వారా ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించారు. కేక్ కట్ చేసి సీతక్క జన్మదిన వేడుకని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గోవింద్ రెడ్డి, ప్రమోద్ రెడ్డి, చంద్ర రెడ్డి పోలీస్, వసంత్ రామ్ రెడ్డి, ఫణి రెడ్డి బద్దం తదితరులు సమన్వయపరిచారు.

Dallas NRTs Congratulate And Celebrate Revanth Reddy's Appointment As TPCCP
Dallas NRTs Congratulate And Celebrate Revanth Reddy's Appointment As TPCCP