కృష్ణా జిల్లా గన్నవరంలో ఎన్నారై భర్త ఇంటి ఎదుట భార్య నిరసన దీక్ష చేపట్టారు. కిరణ్మయికి బోర్రా సుధీర్ కుమార్‌తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహం జరిగిన కొన్ని రోజులకే సుధీర్ కుమార్ ఇటలీ వెళ్లిపోయాడని, కొంత కాలంగా తనను పట్టించుకోకుండా అధిక కట్నం కోసం వేధిస్తున్నారని కిరణ్మయి ఆరోపించారు. భర్త కాల్ లిస్ట్ చెక్ చేయగా ఇటలీలో విజయవాడకు చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసిందని కిరణ్మయి ఆరోపించారు. తనకు న్యాయం చేయాలంటూ గన్నవరంలోని భర్త ఇంటి ఎదుట ఆమె నిరసన దీక్ష చేపట్టారు. కేసు నమోదు చేసిన గన్నవరం పోలీసులు బాధితురాలిని విచారిస్తున్నారు.
గన్నవరం ఎన్నారై ఇంటి ఎదుట మహిళ నిరసన
Related tags :