తెలుగునాట యువతరంలో మంచి ఫాలోయింగ్ ఉన్న కథానాయికల్లో కన్నడ సొగసరి నభా నటేష్ ఒకరు. చలాకీ అభినయానికి పెట్టింది పేరుగా ఈ భామ కెరీర్‌లో రాణిస్తోంది. ప్రస్తుతం నితిన్ సరసన ‘మాస్ట్రో’ చిత్రంలో నటిస్తోన్న ఆమె తెలుగులో బంపరాఫర్‌ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. గోపీచంద్ కథానాయకుడిగా శ్రీవాస్ దర్శకత్వంలో ఓ చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో నభానటేష్ కథానాయికగా ఖరారైందని తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో నభానటేష్ అందం, అభినయం కలబోసిన పాత్రలో కనిపించనుందని సమాచారం. ‘ఇస్మార్ట్‌శంకర్’తో మంచి స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న ఈ కన్నడ సొగసరికి ఆ తర్వాత ఆశించిన విజయాలు దక్కలేదు. ఆమె నితిన్ సరసన కథానాయికగా నటిస్తున్న ‘మాస్ట్రో’ చిత్రం త్వరలో ఓటీటీ వేదికగా విడుదల కానున్నట్లు సమాచారం.
గోపీ సరసన నభా
Related tags :