* సొంత ఫ్లాట్, సంవత్సరానికి రూ.20లక్షల ఆదాయం, 20 ఎకరాల పొలం, మరో 10 ఎకరాల మామిడి తోట, రూ.15 కోట్ల ఆస్తి ఉన్న వధువుకు 33 ఏళ్లలోపు వరుడు కావలెను. కులం, గోత్రం పట్టింపులు లేవు… వధువు సహా తల్లిదండ్రులు గుంటూరులో ఉన్నారు.. మిగిలిన వివరాలకు కళ్యాణ వేదిక… ఫోన్ నంబరులో సంప్రదించండి..” దినపత్రికల్లో వారాంతాలు, ఆదివారాల్లో కనిపించే ప్రకటనలివి. పెళ్లికాని కూతురు, కొడుకు కోసం వారి తల్లిదండ్రులు లేదా సొంతంగా వరుడు, వధువులే ఈ ప్రకటనలు చూస్తుంటారు. వీటిని అడ్డుపెట్టుకుని కొందరు నేరస్థులు, మ్యారేజీ బ్యూరోలు మోసాలకు పాల్పడుతున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలన్న లక్ష్యంతో తెలివైన నేరగాళ్లు ఈ విధమైన మోసాలకు పాల్పడుతున్నారు. రెండు, మూడు ఫోన్లు… నాలుగు ప్రకటనలు…పెళ్లి సంబంధాల పేరుతో తెలివిగా రూ.లక్షలు స్వాహా చేస్తున్నారు. రెండు, మూడు చరవాణులు కొనుగోలు చేయడం, ఓ యాభై సిమ్ కార్డులను తీసుకుని స్థానిక దినపత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నారు. ఫలానా ఫోన్ నంబరుకు ఫోన్ చేస్తే చాలు.. పదిహేను రోజుల్లో ఐదు పెళ్లి సంబంధాలు చూపిస్తామంటూ నమ్మకంగా చెబుతున్నారు. మరికొందరు ఈ-మెయిల్ చిరునామాలను ఇస్తున్నారు. వధూవరులెవరైనా సరే… పెళ్లి సంబంధాలు చూపించాలంటే రూ.3వేల నుంచి రూ.5వేల వరకూ రిజిస్ట్రేషన్ రుసుం అంటూ చెబుతున్నారు. రోజుకు ఐదుగురు చెల్లించినా… రూ.15 వేల సంపాదన ఖర్చులు మినహాయించుంటే రూ.10వేలు నికర ఆదాయం… రూ.3వేలు ఇచ్చిన వారు ఒకటి, రెండుసార్లు ప్రశ్నిస్తారు… తర్వాత వదిలేస్తారన్న ధీమా. తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించొచ్చన్న భావనతోనే కొందరు విద్యావంతులు, మహిళలు మ్యారేజ్ బ్యూరోల పేరుతో మోసాలకు తెర తీశారు. పెళ్లి సంబంధాల పేరుతో ముందుగా రిజిస్ట్రేషన్ పేరుతో రూ.5వేల నుంచి రూ.10వేలు తీసుకుంటున్నారు. వారం రోజుల తర్వాత ఫోన్ చేయాలంటూ డబ్బు ఇచ్చిన వారికి చెబుతున్నారు. వారం రోజుల తర్వాత ఫోన్ చేస్తే మాట్లాడ్డం లేదు. రూ.5వేలు, రూ.10వేలు పెద్ద మొత్తం కాదని అనుకుంటున్నారు. పైగా పోలీసుల వద్దకు వచ్చి మ్యారేజ్ బ్యూరో వారు మోసం చేశారని వివరిస్తే… పరువు పోతుందన్న భావనతో చాలామంది బాధితులు ఫిర్యాదు చేసేందుకు జంకుతున్నారు.
* దమ్మాలపాటి శ్రీనివాస్ వ్యవహారంలో సుప్రీంలో పిటిషన్‌ను రాష్ట్రప్రభుత్వం ఉపసంహరించుకుంది.
* యాదాద్రి రెండో ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.విరామం లేకుండా కురుస్తున్న వానలతో యాదాద్రి రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి.కొండపైకి చేరుకునే రెండో ఘాట్ రోడ్డు మార్గమధ్యలో పక్కనగల కొండరాళ్లు కూలాయి.ఘాట్ రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా బ్లాస్టింగ్ చేయడం వల్ల, వరుసగా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయి.ఈ మార్గంలో అధికారులు వాహన రాకపోకలను నిలిపివేశారు.మొదటి ఘాట్ రోడ్డు ద్వారా భక్తులకు ఇబ్బందులు కలగకుండా వాహనాలను కొండపైకి అనుమతిస్తున్నారు.
* శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారులో మంటలు. ఔటర్ రింగ్ రోడ్డు గుండా శంషాబాద్ నుండి గచ్చిబౌలి వెళ్తుండగా ఎయిర్ పోర్ట్ కాలనీ వద్దకు రాగానే ఒక్కసారిగా కారు ఇంజన్ లో నుండి మంటలు చెలరేగాయి. కారు డ్రైవర్ మంటల్లో చిక్కుకు పోవడంతో అదే మార్గం నుండి వెళ్తున్నా లారి, ఆటో డ్రైవర్ గమనించి మంటల్లో చిక్కుకున్న డ్రైవర్ ను వెలికి తీసి 108 వాహనంలో సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. గాయపడ్డ వ్యక్తి రంగారెడ్డి జిల్లా కొత్తుర్ మండలం తిమ్మాపూర్ కు చెందిన శ్రీకాంత్ గా గుర్థించిన పోలీసులు… శ్రీకాంత్ మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడడంతో అతని పరిస్థితి అందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.