* SI పై అట్రాసిటీ కేస్, సబ్ జైల్ కి తరలింపు. మహిళా ట్రైనీ ఎస్ఐపై అత్యాచారయత్నం చేసిన మరిపెడఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు రిమాండ్ కి తరలించారు.◆ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై మంగళవారం లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఐజీ నాగిరెడ్డి ఆదేశాల మేరకు మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి..ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.◆ శ్రీనివాస్ రెడ్డిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీస్ అధికారే ఇలా చేయడంపై డిపార్ట్ మెంట్ సీరియస్ గా తీసుకుంది.
* జయభేరి ఛైర్మన్ మురళీమోహన్, కుటుంబసభ్యులకు ఏపీ హైకోర్టులో ఊరట.వారిపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఆదేశించిన హైకోర్ట్.స్థలం తీసుకుని మోసగించారని మురళీమోహన్‌పై భూ యజమాని సీఐడీకి ఫిర్యాదు.భూ యజమాని ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి 41ఏ సెక్షన్ కింద నోటీసు ఇచ్చి రేపు విచారణకు రావాలని పిలిచిన సి ఐ డి.దీంతో హైకోర్టులో మురళీమోహన్, కుటుంబసభ్యులు క్వాష్ పిటిషన్ దాఖలు.మురళీమోహన్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్.సివిల్ వివాదాన్ని క్రిమినల్ వివాదంగా మార్చారని పేర్కొన్న శ్రీనివాస్.జయభేరీ ప్రాపర్టీస్ ఒప్పందాన్ని ఉల్లంఘించలేదని కోర్ట్ కు తెలియన న్యాయవాది.దీంతో కేసులో అన్ని రకాల చర్యలను నిలిపివేయాలని ఆదేశించిన హైకోర్టు.
* సోషల్ మీడియా లో పోస్టులు పెట్టిందని జ్యోతి శ్రీ ని అరెస్ట్ చేసిన సిఐడీ పోలీసులు..గుంటూరు తెనాలి కి చెందిన బొలినేని జ్యోతి శ్రీ పై కేసు నమోదు చేసిన సిఐడీ పోలీసులు.నిన్న ఉదయం విచారణ పేరుతో గుంటూరు లోని సిఐడీ ప్రాంతీయ కార్యాలయం కు తీసుకువచ్చిన అధికారులు, రెండు వర్గాలు, రెండు కులాల మద్య గొడవలు సృష్టించే విధంగా సోషల్ మీడియా లో పోస్టులు పెడుతుందని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడీ కేసు నమోదు.153ఆ,120 ఋ/వ్,505(2) సెక్షన్లు నమోదు.ఈ రోజు కోర్టు లో హాజరు పరిచిన సిఐడి పోలీసులు..బెయిల్ మంజూరు చేసిన కోర్ట్.
* ఓ హోటల్‌లో పుట్టిన రోజు వేడుకలు.నగరంలో రేవ్ పార్టీ అంటూ కలకలం.పార్టీకి హాజరైన సీసీఎస్ సీఐపై సస్పెన్షన్ వేటు…..జన్మదిన వేడుకల్లో జరిగిన అసభ్య నృత్యాల్లో పాల్గొన్న సీఐపై సస్పెçన్షన్ వేటు పడింది. సేకరించిన సమాచారం ప్రకారం… గుంటూరు నగరంలోని ఇన్నర్ రింగు రోడ్డు సమీపంలో ఉన్న తెలుగింటి రుచులు రెస్టారెంట్‌లో సోమవారం రాకేష్ అనే వ్యక్తి జన్మదిన వేడుకలు జరిగాయి. అయితే పార్టీలో భాగంగా తన స్నేహితులతో కలిసి మద్యం సేవించటంతో పాటు, విజయవాడ నుంచి పిలిపించిన ఆరుగురు యువతులతో అసభ్య నృత్యాలు కూడా జరిగాయి.ఈ క్రమంలో పక్కా సమాచారం అందుకున్న పట్టాభిపురం పోలీసులు దాడి చేసి మొత్తం 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కోవిడ్ నిబంధనలు అతిక్రమించటం, అధిక శబ్ధాలతో ఇతరులకు ఇబ్బంది కలిగించడం, దీంతో పాటుగా మద్యం సేవించటం, అసభ్యకరమైన నృత్యాలు చేసిన కేసు నమోదు చేసి, స్వంత పూచీకత్తులపై పంపించి చేశారు. అయితే జరిగిన పార్టీకి అర్బన్ సీసీఎస్‌లో పని చేస్తున్న సీఐ వెంకటేశ్వర రావు కూడా హాజరయ్యారు.