Business

ఇండిగో భారీ రాయితీ. టాటా కొత్త టియాగో-వాణిజ్యం

ఇండిగో భారీ రాయితీ. టాటా కొత్త టియాగో-వాణిజ్యం

* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎంపీ లు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్ దాస్, రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎస్.ఎస్ రావత్ లతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను పార్లమెంటులో కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల పై చర్చించారు.

* ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లు.. ఒక అసిస్టెంట్ సెక్రెటరిని సస్పెండ్ చేసిన ప్రభుత్వం.ఆర్థిక శాఖలో సెక్షన్ ఆఫీసర్లుగా పని చేస్తున్న డి. శ్రీనిబాబు, కే. వర ప్రసాదులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు.అసిస్టెంట్ సెక్రెటరీ నాగులపాటి వెంకటేశ్వర్లుని సస్పెండ్ చేసిన ప్రభుత్వం.ప్రభుత్వ సమాచారం లీక్ చేస్తున్నారని భావించిన ప్రభుత్వం.ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్యార్టర్ విడిచి వెళ్లరాదని ప్రభుత్వం ఆదేశం.

* తిరుమల ఇవాళ ప్రత్యేక దర్శనం రూ. 300 టిక్కెట్లు విడుదల చేయనున్న టీటీడీ, ఈ నెలకు సంబంధించి 17వ తేదీ నుండి 20వ తేదీ వరకు టిక్కెట్లు విడుదల…. రోజుకు 8 వేల టిక్కెట్లను ఇవాళ ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్న టీటీడీ

* ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో విమాన టికెట్ల ధరలపై భారీ రాయితీ ప్రకటించింది. కేవలం రూ.915 ప్రారంభ ధరతో టికెట్‌ బుక్‌ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. హెచ్‌ఎస్‌బీసీ క్రెడిట్‌ కార్డు ఉన్నవారికి అదనంగా ఐదు శాతం క్యాష్‌బ్యాక్‌ కూడా ఆఫర్‌ చేస్తోంది. సంస్థ 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఆఫర్లను ప్రకటించింది.

నేటి(ఆగస్టు 4) నుంచి ఆగస్టు 6 మధ్య టికెట్లను బుక్ చేసుకోవాలి. వీరు సెప్టెంబరు 1, 2021- మార్చి 26, 2022 మధ్య ప్రయాణించవచ్చు. ఫాస్ట్‌ ఫార్వర్డ్‌, 6ఈ ఫ్లెక్స్‌, 6ఈ బ్యాగ్‌పోర్ట్‌, కార్‌ రెంటల్‌ సర్వీస్‌ వంటి అదనపు సేవలను సైతం రూ.315లకే అందజేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో…అయితే, ఇండిగో వెబ్‌సైట్‌ ప్రకారం.. ఈ రాయితీ ధర కొన్ని ప్రత్యేక రూట్లకు మాత్రమే వర్తిస్తుంది. హైదరాబాద్‌ నుంచి ప్రారంభమయ్యే విమానాల టికెట్ల కనీస ధర రూ.1,415గా ఉండడం గమనార్హం. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు రూ.1,415, చెన్నైకి రూ.1,715, తిరుపతికి రూ.1,815, ముంబయి, దిల్లీ, గోవాకు రూ.1,915, విశాఖపట్నం, విజయవాడకు రూ.2,115గా విమాన టికెట్‌ ధరను నిర్ణయించారు. విశాఖపట్నం నుంచి రాజమండ్రికి రూ.1,215, హైదరాబాద్‌, చెన్నైకి రూ.2,115, బెంగళూరుకు రూ.2,315 చొప్పున ఫ్లైట్ టికెట్‌ ధరలు ఉన్నాయి. విజయవాడ నుంచి తిరుపతికి రూ.1,815, హైదరాబాద్‌కు రూ.2,015, చెన్నైకి రూ.2,315, బెంగళూరుకు రూ.2,815గా టికెట్‌ ధరలను నిర్ణయించారు.

* దేశీయ ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్‌ హ్యాచ్‌బ్యాక్‌ విభాగంలో మరో కొత్త కారును మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఉన్న టియాగోకు ఎస్‌యూవీ లుక్‌ అందిస్తూ టియాగో ఎన్‌ఆర్‌జీ పేరిట కొత్త కారును విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ.6.57 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌, దిల్లీ) కంపెనీ నిర్ణయించింది. ఎస్‌యూవీ తరహాలో ఎక్కువ గ్రౌండ్‌ క్లియరెన్స్‌, పెద్ద టైర్లు, బాడీ క్లాడింగ్‌, రూఫ్‌ రైల్స్‌ వంటి సదుపాయాలు ఈ కారు సొంతం.