DailyDose

అపార్ట్‌మెంట్‌లో నిహారిక భర్త న్యూసెన్స్…పోలీసు కేసు-నేరవార్తలు

అపార్ట్‌మెంట్‌లో నిహారిక భర్త న్యూసెన్స్…పోలీసు కేసు-నేరవార్తలు

* అర్ధరాత్రి ఏమైందో ఏమో కానీ మెగా డాటర్ నిహారిక అపార్ట్‌మెంటులో రచ్చ రచ్చ అయింది. నిహారిక భర్త న్యూసెన్స్ చేస్తున్నాడంటూ ఒక్కసారిగా కలకలం రేగింది. అపార్ట్ మెంట్ వాసులకు, నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డకు మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. దీంతో అపార్టు‌మెంటు వాసులంతా చైతన్యపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అపార్ట్ మెంట్ వాసులపై నిహారిక భర్త సైతం ఫిర్యాదు చేశారు. పోలీసులు పరస్పర ఫిర్యాదులను స్వీకరించి విచారణ నిర్వహిస్తున్నారు.

* విజయనగరం జిల్లా తణుకు కొత్తవలస పోలీస్ స్టేషన్ నందు, స్టేషన్ బెయిలు మంజూరు చేయుటకు గాను 30,000/- రూపాయలు లంచంగా డిమాండ్.. అడ్వాన్సుగా 15000/- రూపాయలు తీసుకొన్న SI, మిగిలిన 15000/- రూపాయల లంచం సొమ్మును తన నివాసంలో తీసుకొంటుండగా ACB అదికారులు వలపన్ని పట్టుకొన్నారు..

* దేశరాజధాని నగరంలో తొమ్మిదేళ్ల బాలికపై హత్యాచారానికి పాల్పడిన వారిని ఉరితీయాల్సిందేనని విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) డిమాండ్‌ చేసింది. ఈ కేసును ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుకు బదిలీ చేసి విచారణను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ హత్యాచార ఘటనపై యావత్‌ భారతదేశం, హిందూ సమాజం తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తోందని వీహెచ్‌పీ ట్విటర్‌లో పేర్కొంది. 15 రోజుల్లో ఈ కేసు దర్యాప్తును పూర్తి చేయాలని, అలాగే, మూడు నెలల్లో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారణ ముగించాలని కోరింది. ఈ కేసులో దోషులకు మరణదండన విధించాలని వీహెచ్‌పీ డిమాండ్‌ చేసింది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం సాయం చేయాలని వీహెచ్‌పీ విజ్ఞప్తి చేసింది.

* వాట్సాప్ మెసేజ్‌ల‌తో లైంగిక వేధింపుల‌కు గురిచేయ‌డ‌మే కాకుండా ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌ల్లో ఫెయిల్ చేసిన మెడిక‌ల్ కాలేజ్ ప్రొఫెస‌ర్‌పై విద్యార్దిని ప‌ట్టువ‌ద‌ల‌కుండా చేసిన పోరాటం కీచ‌క ప్రొఫెస‌ర్ అరెస్ట్‌కు దారితీసింది. ఏప్రిల్ 26న ఎంబీబీఎస్ ఫ‌స్టియ‌ర్ విద్యార్ధిని భిల్వారాలోని సుభాష్ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో ప్రొఫెస‌ర్ శంక‌ర్ మోహ‌న్ ప‌న్వ‌ర్‌పై ఫిర్యాదు చేసింది. మెడిక‌ల్ కాలేజ్‌లో బ‌యోకెమిస్ట్రీ ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేసే ప‌న్వ‌ర్ వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా నిత్యం వేధించేవాడ‌ని విద్యార్ధిని ఆరోపించింది.

* నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో కార్యాలయంలో పని చేసే సీనియర్ అసిస్టెంట్ ఓరుగంటి శ్రీనివాస్ రూ.8 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిర్మల్ మండలం వెంగ్వాపేట్‌కు చెందిన రిటైర్డ్ ఎఫ్ఎస్ఓ రాజేశ్వర్ 2018 సంవత్సరంలో రిటైర్మెంట్ అయ్యారు.