మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు నరేశ్‌పై నటి హేమ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఏడాది జరగనున్న ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం రేసులోకి దిగుతున్న హేమ తాజాగా ఎలక్షన్స్ గురించి స్పందించారు. ఈ ఏడాది ‘మా’ అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడేలా కొంతమంది చూస్తున్నారని.. లేదా ఎన్నికలు లేకుండా నరేశ్‌నే అధ్యక్షుడిగా కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె వ్యాఖ్యలు చేశారు. అసోసియేషన్ నిధులను నరేశ్ విచ్చలవిడిగా ఖర్చుపెట్టారని విమర్శించారు. అధ్యక్ష పీఠం నుంచి దిగకుండా ఉండేందుకు నరేశ్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె తీవ్రంగా ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఉదయం 200 మంది అసోసియేషన్ సభ్యులకు హేమ లేఖలు రాశారు. ఏది ఏమైనా ఈ ఏడాది ‘మా’ అధ్యక్ష ఎన్నికలు జరిగేలా చూడాలంటూ వారందరి నుంచి ఆమె సంతకాలు సేకరించారు.
“మా” ఎన్నికలు ఆపేందుకు నరేష్ విశ్వప్రయత్నం
Related tags :