DailyDose

బెజవాడలో వార్డు సెక్రటరీలపై హత్యాయత్నం-నేరవార్తలు

బెజవాడలో వార్డు సెక్రటరీలపై హత్యాయత్నం-నేరవార్తలు

* కృష్ణలంకలో రౌడీ రాజ్యం.టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై దాడి.బిల్డింగ్ ఇన్స్పెక్టర్, మహిళా వార్డు సెక్రటరీలపై ఐరన్ రాడ్డుతో హత్యాయత్నం.అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవడంతో రెచ్చిపోయిన భవన యజమాని.21వ డివిజన్ కృష్ణలంక కోదండ రామాలయంవీధిలో ఘటన.

* తమ కుటుంబానికి భద్రత కల్పించాలని కడప ఎస్పీకి వైఎస్‌ సునీత లేఖ రాశారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆమె వాపోయారు. ఈ నెల 10న సాయంత్రం 5:20 గంటలకు ఓ అనుమానితుడు తమ ఇంటిచుట్టూ రెండుసార్లు తిరిగాడని, ఇంటి కాంపౌండ్‌ తరువాతి డోర్‌ దగ్గర ఆగి ఫోన్‌ కాల్స్‌చేశాడని లేఖలో సునీత వెల్లడించారు. శివశంకర్‌రెడ్డి బర్త్‌ డే కోసం ఏర్పాటైన ఫ్లెక్సీలోని వ్యక్తిలాగే అనుమానితుడు కనిపించాడని, ఈ విషయాన్ని సీఐకి ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. చివరికి ఆ వ్యక్తిని మణికంఠరెడ్డి అని తేల్చారని తెలిపారు. శివశంకర్‌రెడ్డికి మణికంఠరెడ్డి అత్యంత సన్నిహితుడని సునీత చెప్పారు. తన తండ్రి హత్యకేసులో శివశంకర్‌రెడ్డి కీలకమైన అనుమానితుడని, ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని శివశంకర్‌రెడ్డి పాత్రను నిగ్గుతేల్చాలని కోరారు. అయితే వివేకా హత్య కేసులో ఈ రోజు సీబీఐ విచారణకు శివశంకర్‌రెడ్డి హాజరయ్యారు.

* విజయసాయి రెడ్డి బెయిల్ పై సీబీఐ కోర్టు లో విచారణ.బెయిల్ రద్దు విషయమై నిర్ణయం కోర్టే తీసుకోవాలని మెమో దాఖలు చేసిన సీబీఐ.విచారణ 16 కు వాయిదా.

* కీసర ఔటర్‌ రింగ్‌రోడ్డుపై లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన బొగ్గు లారి ఓఆర్‌ఆర్‌పై ఆగివున్న రెండు బొలెరో వాహనాలను ఢీకొట్టింది. అప్పటికీ ఆగని లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బొలెరో డ్రైవర్‌ రాములు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.

* శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట జాతీయ రహదారికి సమీపంలో మున్నాభాయ్ డాబా ఎదురుగా కాళంగి నది కి సమీపంలో చెట్టుకు వేలాడుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది.ఈ వ్యక్తి ఏ ప్రాంతానికి చెందిన వాడు ఇది హత్య లేక ఆత్మహత్య అనే వాస్తవ వాస్తవాలు తెలియాల్సి ఉంది.మృతదేహం బాగా చెడి దుర్వాసన వెదజల్లుతోంది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.