* నమస్తే తెలంగాణ తుఫ్రాన్ రూరల్ రిపోర్టర్ సీహెచ్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న రాత్రి చెవురులో దూకి ఆయన ఆత్మహత్య చేసుకోగా.. ఈరోజు ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తన మెడలో నమస్తే తెలంగాణ అక్రిడిటేషన్ కార్డును వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు స్థానికులు తెలిపారు. ఈ ఆత్మహత్య వార్త కలకలం రేపుతున్నది. ఏడాది క్రితం నాగరాజు .. నమస్తే తెలంగాణ సంస్థ విధించిన టార్గెట్లు చేయకపోతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ తన ఇబ్బందికర పరిస్థితులను వివరిస్తూ ఓ సుధీర్ఘ లేఖను రాసి మంత్రి హరీశ్‌రావుకు పంపాడు. అందులో తాను శానిటైజర్ తాగి ఆత్మహత్యచేసుకుంటున్నట్లు వెల్లడించడంతో ఈ లేఖ కలకలం రేపింది. అప్పటికే నాగరాజును ఆస్పత్రికి తీసుకుపోవడంతో చావుతప్పి బయటపడ్డాడు.ఏడాది తర్వాత ఇప్పుడు ఇలా నాగరాజు బలవన్మరణం పొందాడు. కొత్త ఎడిటర్ తీగుళ్ల కృష్ణమూర్తి వచ్చిన తర్వాత చాలా మార్పులు జరిగాయి. చాలా మంది ఉద్యోగులను తీసేశారు.ఉన్నవాళ్లను రోజూ బెదిరిస్తూ పనిచేయించుకునే పరిస్థితి వచ్చింది. దీనికి తోడు టార్గెట్లు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. టీఆరెస్ నాయకులు పట్టించుకోరు.. ఇతర పార్టీ నాయకులు దగ్గరకు కూడా రానియ్యరు. టార్గెట్లు మాత్రం చేయమంటారు. ఈ వేధింపులు రోజు రోజుకు ఎక్కువవుతున్న తరుణంలో నాగరాజు ఇక ఆత్మహత్యే శరణ్యమని అప్పుడు భావించాడు. ఇప్పటి ఆత్మహత్యకు కారణం నమస్తే వేధింపులేనా? ఎమైనా సూసైడ్ లెటర్ రాశాడా? రాస్తే ఎవరి గురించి రాశాడు? ఇంకా తెలియాల్సి ఉంది.ఏడాది క్రితం నాగరాజు మంత్రి హరీశ్‌రావుకు రాసిన లేఖ.. యథాతథంగా..నమస్తే సార్..నేను సీహెచ్ నాగరాజు…తూప్రాన్ రూరల్ నమస్తే తెలంగాణ రూరల్ రిపోర్టర్ గా పని చేస్తున్నాను. గత కొద్ది సంత్సరాలుగా మెదక్ జిల్లా తూప్రాన్ రూరల్ నమస్తేతెలంగాణ రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తున్నాను.అయితే ఇప్పటి వరకు 20 సంవత్సర చందా కాపీలు,15000 ఆడ్స్ ఇచ్చాను సార్.కాని మరికొన్ని ఆడ్స్, చందా క్సాపీలు,ఆడ్స్ కావాలని అంటున్నారు. మా కుమారుడు దగ్గు జలుబు జ్వరంతో బాధపడుతున్నారు. నేను ఈ బాధకు భరించాలేక గురువారం శానిటైజేసర్ తాగాను. ఈ 3 నెల లో 17 స్టోరీలు ఇచ్చాను సార్.ఎం చేయాలి సార్. రేపు సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు వద్ద నిర్వహించబోయే సమావేశానికి నేను హాజరు కాలేకపోతున్నాను.కారుకు డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో నేను ఉన్నాను సార్. గతములో నేను స్వంత డబ్బులతో పెట్రోల్ పోసుకొని అసెంబెల్లీ ఎన్నికల్లో ప్రచారం న్యూస్ వేశాను. మున్సిపల్ ఎన్నికకల్లో రూ.90 వేల ఆడ్స్ ఇచ్చాను సార్2.ఇప్పుడు అడిగితే టీఆర్ఎస్ నాయకులు డబ్బులు లేవని చెబుతున్నారు. సార్. ఏం చేయాలో అర్థం కాక ఈ రోజు సాయంత్రం శానిటైజర్ సేవించాను సార్. మా కుటుంబానికి మీరే దిక్కు.ఇట్లు..సీహెచ్ నాగరాజు…తూప్రాన్ రూరల్ రిపోర్టర్…మెదక్ జిల్లా.
* కర్ణాటక నుండి ప్రయాణికులతో తిరుపతి వస్తున్న ఆర్టిసి బస్సు చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదానికి గురయ్యింది. బస్సు చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. దీంతో బస్సులోని 22మంది ప్రయాణిసులు తీవ్రంగా గాయపడగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం.ఈ ప్రమాదానికి సంబంధించి క్షతగాత్రులు, ఆర్టిసి ఉన్నతాధికారులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం ఉదయం మదనపల్లె డిపోకు చెందిన ఆర్టిసి బస్సు బళ్లారి నుండి తిరుపతికి ప్రయాణికులతో బయలుదేరింది. అయితే బస్సు చిత్తూరు జిల్లా భాకరాపేట ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా డ్రైవర్ గుండె పోటుకు గురయ్యాడు. దీంతో బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయింది.
* భారీ భూకంపంతో కరేబియన్ దేశం హైతీ ఘోరంగా వణికిపోయింది. శనివారం సంభవించిన భూకంపం దాటికి 300 మందికి పైగా చనిపోయినట్లు తెలుస్తోంది. ఎటుచూసినా భవనాలు కుప్పకూలి కనిపిపస్తుండడంతో క్షతగాత్రుల సంఖ్య ఊహించని రీతిలో ఉండేలా కనిపిస్తోంది.
* గుంటూరు నగరంలో బిటెక్ విద్యార్ది హత్య.! నడిరోడ్డు మీద విద్యార్థిపై కత్తితో ఓ యువకుడు దాడి .కత్తి తో పొడిచి పరైరాన యువకుడు. కాకాని రోడ్డులో పరామయ కుంటలో ఘటన. సెయింట్ మేరీస్ కాలేజి బిటెక్ 3వ సంవత్సరం చదువుతున్న నల్లపు రమ్య. జిజిహెచ్ లో విద్యార్థి మృతదేహాన్ని పరిశీలించిన అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్.