బాడీ షేమింగ్ (శరీరాకృతిని హేళన చేయడం) విషయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న నటీమణులు ఉన్నారు. వారిలో బాలీవుడ్ నటి విద్యా బాలన్ ఒకరు. లావుగా ఉన్నందుకు తన దేహాన్ని తానే అసహ్యించుకునేదాన్నని ఎన్నోసార్లు ఆమె వెల్లడించారు. ఇలాంటి అవమానాలు ఎదుర్కొనేవారికి సాయం చేసేందుకు, ఇతరుల్లో స్ఫూర్తి నింపేందుకు విద్య.. ప్రముఖ రేడియో స్టేషన్ బిగ్ ఎఫ్‌ఎంతో కలిసి ఓ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమం పేరు ‘ధున్ బదల్ కే దేఖో’. ఈ నేపథ్యంలో బిగ్ ఎఫ్‌ఎం విద్యతో ఓ వీడియోను రూపొందించింది. ఆ వీడియోలో ఇతరుల శరీరాకృతిని, రూపును చూసి వెక్కిరించొద్దని పాట పాడుతూ విద్య కన్నీరుపెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జీవితంలో బాడీ షేమింగ్ సంఘటనలు ఎదుర్కొన్న యువతీయువకులు ఈ కార్యక్రమం ద్వారా తమ సమస్యలు చెప్పుకొనే అవకాశం ఉంది.
అవమనాలు పంచుకోవడానికి
Related tags :