* 37 లక్షల రూపాయలు మోసం చేసిన సైబర్ చీటర్స్..ఆన్లైన్ ట్రేడింగ్ లో అధిక లాభాలు ఇస్తామని ఇద్దరు వ్యక్తుల నుండి 3.7 లక్షల మోసం.హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు.గిఫ్ట్ పేరుతో ఓ మహిళ నుండి 16 లక్షల మోసం.నైజీరియన్ అరెస్ట్.హైదరాబాద్ బోయిన్ పల్లి కి ఓ మహిళకు విలువైన బహుమతి వచ్చిందని కాల్.అందుకుగాను వివిధ చార్జీల పేరుతో 16 లక్షలు మోసపోయిన మహిళ.గతంలో సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు.ఈ కేసులో ఢిల్లీలో మైకేల్ అనే నైజీరియన్ ను అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు.లాటరీలో విలువైన కారు గెలుపొందారని 17.35 లక్షల మోసం.హైదరాబాద్ గోల్కొండ కు చెందిన అబ్దుల్ ముజీబ్ ఖాన్ కు విలువైన కార్ గెలిచారంటూ కాల్ చేసిన సైబర్ చీటర్స్.కార్ కావాలా, క్యాష్ కావాలా అడిగిన చీటర్స్..నగదు కావాలని అడిగిన బాధితుడు.ఆ డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలంటే వివిధ చార్జీలు కట్టాలని. ఆన్లైన్ ద్వారా 17.35 లక్షలు కాజేసిన చీటర్స్.హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
* ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టులో మరో రెండు చార్జిషీట్లు దాఖలు చేసింది. వాన్ పిక్, లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసుల్లో ఈ చార్జిషీట్లు దాఖలు చేసింది. సీబీఐ చార్జిషీట్ల ఆధారంగా ఈడీ అధికారులు విచారణ కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మనీలాండరింగ్ అభియోగాలతో చార్జిషీట్లు దాఖలు చేశారు. కాగా, ఇప్పటికే ఏడు ఈడీ చార్జిషీట్లపై సీబీఐ, ఈడీ కోర్టు విచారణ జరుపుతోంది.
* రమ్య హత్య జరిగిన తర్వాత నిందితుడు తన తల్లి ఉంటున్న గోళ్లపాడుకు చేరుకున్నాడు.మరో వైపు జిల్లా పోలీసులు 5బృందాలు గా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.గోళ్లపాడులో ఉన్నాడని సమాచారం అందుకున్న పోలీసులు ముప్పాళ్ల స్టేషన్ సిబ్బందిని అలెర్ట్ చేశారు.ఈ నేపథ్యంలో నిందితుడు శశి కృష్ణ గ్రామ శివారులో సేఫ్ ఔషధ కంపెనీ వైపు వెళ్తున్నాడని తెలిసి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మొహమ్మద్ రఫీ (HC3819) నిందితుడు శశికిరణ్ ను గంట పాటు వెంబడించాడు.శశిని పట్టుకునే క్రమంలో నిందితుడు కాల్వలోకి దూకాడు.కత్తితో బెదిరించినా రఫీ వెనుదిరగక కాల్వలోకి దూకి, శశి తో పెనుగులాడిపట్టుకున్నాడు.స్టేషన్ కు సమాచారం ఇచ్చి గుంటూరు తరలించారు.ఈ సంఘటనలో కానిస్టేబుల్ రఫి ధైర్య సాహసాలు ప్రదర్శించి హత్యా నిందితుడిని పట్టుకోడంతో ఎస్సై పట్టాభిరమ్, తోటి సిబ్బంది అభినందించారు.
* వైసీపీ ఎన్ఆర్ఐ సభ్యుడు పంచ్ ప్రభాకర్‌పై కేసు నమోదు – పంచ్ ప్రభాకర్‌పై కేసు నమోదు చేసిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు – ఉపరాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు – రఘురామకృష్ణరాజు సహా పలువురు ప్రముఖులపై అనుచిత వ్యాఖ్యలు – యూట్యూబ్‌లో వీడియోలు పెట్టిన వ్యవహారంలో కేసు నమోదు – స్థానిక కోర్టు అనుమతితో ఐపీసీ 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు – యూట్యూబ్ సంస్థకు కూడా నోటీసులు జారీ చేసిన ఢిల్లీ పోలీసులు – పంచ్ ప్రభాకర్ వీడియోల పూర్తి సమాచారం అందించాలని ఆదేశం – ఎంపీ రఘురామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు – పంచ్ ప్రభాకర్‌పై కేసు విచారణ కొనసాగుతుందన్న పోలీసులు