తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. టాప్-10లో ఇంజినీరింగ్ విభాగంలో ఆరుగురు, అగ్రికల్చర్‌లో నలుగురు ఏపీ విద్యార్థులు ఉండటం గమనార్హం. టాప్-5 ర్యాంకులను పరిశీలిస్తే.. ఇంజినీరింగ్‌లో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సత్తి కార్తికేయ తొలి ర్యాంకు, కడప జిల్లా రాజంపేటకు చెందిన పణీశ్‌కు రెండో ర్యాంకు, హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ మూడో ర్యాంకు, నల్గొండ విద్యార్థి రామస్వామికి నాలుగో ర్యాంకు, హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన వెంకట ఆదిత్య ఐదో ర్యాంకు సాధించారు. అగ్రికల్చర్ విభాగంలో మొదటి ర్యాంకు హైదరాబాద్ బాలానగర్‌కు చెందిన మండవ కార్తికేయ, రెండో ర్యాంకు పెద్దఅంబర్‌పేటకు చెందిన శ్రీనిజకు దక్కింది. మూడో ర్యాంకును కూకట్‌పల్లికి తేరుపల్లి సాయి కౌశల్‌రెడ్డి, నాలుగో ర్యాంకును అనంతపురానికి చెందిన రంగు శ్రీనివాస కార్తికేయ, ఐదో ర్యాంకును రాజమహేంద్రవరానికి చెందిన చందం విష్ణు వివేక్ సాధించారు.
తెలంగాణా ఎంసెట్‌లో గోదావరి విద్యార్థికి మొదటి ర్యాంక్
Related tags :