తిరుమలలో సంప్రదాయ భోజనంపై తితిదే వెనక్కి తగ్గింది. భోజనానికి డబ్బు తీసుకోవాలని నిర్ణయించడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వచ్చాయి. దీంతో తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. సంప్రదాయ భోజన విధానాన్ని తక్షణమే నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై అధికారులతో చర్చించామని.. పాలకమండలి లేనపుడు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. స్వామివారి ప్రసాదంగానే భోజనం అందించాలని.. అన్నప్రసాదానికి డబ్బులు తీసుకోకూడదన్నారు.
తిరుమలలో భోజనానికి డబ్బులు తీసుకోము!
Related tags :