Business

2022లో జీతాలు పెరగవచ్చు-వాణిజ్యం

2022లో జీతాలు పెరగవచ్చు-వాణిజ్యం

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం ఆద్యంతం ఊగిసలాట ధోరణి కనబరిచాయి. ఉదయం నష్టాలతో ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు మధ్యాహ్నం వరకు ఊగిసలాటలోనే కొనసాగాయి. ఐటీ, టెక్‌, టెలికాం, ఆటో, లోహ రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఇంట్రాడే కనిష్ఠాలకు చేరుకున్నాయి. చివర్లో ఇంధన, బ్యాంకింగ్‌, ఆర్థిక రంగాల్లో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో సూచీలు కనిష్ఠాల నుంచి కోలుకున్నాయి. కానీ, పూర్తిస్థాయి లాభాల్లోకి మాత్రం రాలేకపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. పైగా గత కొన్ని రోజుల భారీ లాభాల నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. ఈ పరిణామాల నేపథ్యంలో సూచీల పరుగు డీలాపడింది.

* వ‌చ్చే ఏడాది వివిధ రంగాల ఉద్యోగుల జీతాలు స‌గ‌టున 9.4% పెర‌గ‌వ‌చ్చ‌ని అయాన్ క‌న్స‌ల్టింగ్ సంస్థ స‌ర్వే తెలిపింది. స్తిరాస్థి వంటి రంగం కూడా 2021లో 6.2% జీతాల పెంపుతో పోలిస్తే 2022లో 8.8% జీతాలు పెంచాల‌ని భావిస్తోంది. 2018లో స‌గ‌టు పెరుగుద‌ల 9.5% ఉంద‌ని అయాన్ స‌ర్వే అంచ‌నా వేసింది. గ‌తంలో 2 అంకెల స్థాయిలో వేత‌నాలు పెరిగినా, 2017 ఆ త‌ర్వాత భార‌త్‌లో స‌గ‌టు ఇంక్రిమెంట్ గ‌ణాంకాలు 9.3% క‌న్నా త‌క్కువ‌కి చేరాయి.

* గ‌త కొన్నేండ్లుగా భార‌త్‌లో ప్ర‌ముఖ ఆటోమొబైల్ బ్రాండ్లు రీఎంట్రీ ఇస్తున్నాయి. 2019లో మ‌హీంద్రా భాగ‌స్వామ్యంతో జెక్ బ్రాండ్ జావా దేశీ మార్కెట్‌లోకి తిరిగి రాగా, గ‌త ఏడాది చేత‌క్ అల్బిట్ పేరుతో ఎల‌క్ర్టిక్ వాహ‌న అవ‌తారంలో దర్శ‌న‌మిచ్చింది. తాజాగా ఎల్ఎంఎల్ బ్రాండ్ భార‌త టూ వీల‌ర్ మార్కెట్‌లో తిరిగి గ్రాండ్ ఎంట్రీకి స‌న్న‌ద్ధ‌మైంది. వెస్పాతో క‌లిసి ఎల్ఎంఎల్ ప‌లు స్కూట‌ర్ల‌ను భార‌త్‌లో లాంఛ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

* ఈకామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ సబ్సిడ‌రీ అమెజాన్ పే భార‌త్‌లో వెల్త్ మేనేజ్‌మెంట్ సేవ‌లు అందించేందుకు స‌న్న‌ద్ధమైంది. దేశంలో త‌న 5 కోట్ల మంది క‌స్ట‌మ‌ర్ల‌కు వెల్త్ మేనేజ్‌మెంట్ సేవ‌లు అందించేందుకు పెట్టుబ‌డుల స‌ల‌హా సేవ‌ల స్టార్ట‌ప్ కువేర‌తో అమెజాన్ పే ఒప్పందం చేసుకుంది. మ‌రోవైపు గూగుల్ పే త‌న బ్యాంకింగ్ భాగ‌స్వామి ద్వారా త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల‌ను ఆఫ‌ర్ చేస్తున్న త‌ర‌హాలో అమెజాన్ పే ఈ దిశ‌గా అడుగులు వేస్తోంది. రెండు ప్ర‌పంచస్ధాయి దిగ్గ‌జ సంస్ధ‌ల కార్యాచ‌ర‌ణ‌తో భార‌త ఆర్థిక సేవ‌ల రంగం ముఖ‌చిత్రం మారుతుంద‌ని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక వెల్త్ మేనేజ్‌మెంట్ సేవ‌ల స‌న్నాహాల్లో భాగంగా 2017లో ఏర్పాటైన సెబీ న‌మోదిత ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజ‌ర్ కువేరతో అమెజాన్ పే చేతులు క‌లిపింది. తొలుత మ్యూచువ‌ల్ ఫండ్స్‌, ఎఫ్‌డీల్లో పెట్టుబ‌డుల‌కు కువేర వెసులుబాటు క‌ల్పిస్తుంద‌ని కంపెనీ వ్య‌వ‌స్ధాప‌క సీఈవో గౌర‌వ్ ర‌స్తోగి తెలిపారు. అమెజాన్ పేతో ఇదే త‌మ తొలి వెల్త్ మేనేజ్‌మెంట్ టై అప్ అని ఆయ‌న పేర్కొన్నారు.

* ‘మరో రెండు రోజుల్లో మీ ప్యాక్‌ గడువు ముగుస్తుంది. వెంటనే రీచార్జ్‌ చేయండి’ అని మొబైల్‌కు అలర్ట్‌ మెసేజ్‌లు వస్తుంటాయి. ఇదొక్కటే కాదు బ్యాంకింగ్‌ యాప్‌లు, పేమెంట్‌ వ్యాలెట్లలో గత ఏడాది కాలంలో కొత్త కొత్త ఆప్షన్లు కనిపించడం, సేవల విస్తృతి పెరుగడం వంటివి గమనించే ఉంటాం. ఇవన్నీ ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌తో (ఏఐ) కలుగుతున్న ప్రయోజనాలే. ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ లేదా కృత్రిమ మేధ.. అన్ని రంగాల్లో కీలకంగా మారుతున్న అత్యాధునిక టెక్నాలజీ. ఉత్పత్తిని పెంచడంలో, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో, జీవన ప్రమాణాలను పెంచడంలో కృత్రిమ మేధ (ఏఐ) ముఖ్యపాత్ర పోషిస్తున్నది. ఈ టెక్నాలజీ ఇప్పుడు ఆర్థిక సేవల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఫిన్‌టెక్‌ ప్లాట్‌ఫామ్‌లు ఇప్పటికే ఏఐని విస్తృతంగా వినియోగిస్తున్నాయి. డెలాయిట్‌ సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం 70 శాతం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంస్థలు తమ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కృత్రిమ మేధ/మెషీన్‌ లెర్నింగ్‌ను ఆశ్రయిస్తున్నాయి. దేశ జీడీపీలో ఏఐ వాటా 2.5 శాతానికి పెరుగుతుందని అసోచామ్‌ చెప్పగా, ఈ రంగం ఈ ఏడాది 17.4 శాతం వృద్ధి సాధిస్తుందని ఐడీసీ అంచనా వేసింది.

* ఆన్‌లైన్‌ ద్వారా కార్డు చెల్లింపుల్లో (Online Payments) అవకతవకలు, మోసాలను నివారించేందుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్బీఐ) కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనలను బుధవారం నాడు ఆర్బీఐ జారీ చేసింది. ఈ కొత్త నిబంధనలు వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి అమలులోకి వస్తాయి. ఇకపై ఆన్‌లైన్ చెల్లింపుల కోసం టోకెన్ వ్యవస్థ అందుబాటులోకి రానున్నది. కార్డ్ ద్వారా జరిపే లావాదేవీలలో కార్డ్ జారీ చేసిన బ్యాంక్ లేదా కార్డ్ నెట్‌వర్క్ మినహా మరెక్కడా డాటాను నిల్వ చేయకూడదు.