తిరుమల శ్రీ వేంకటేశ్వరుని సర్వదర్శనం టోకెన్ల జారీని తితిదే పునఃప్రారంభించింది. ఇందులో భాగంగా రోజుకు రెండు వేల టికెట్లను జారీ చేయనుంది. ప్రస్తుతం ఈ టికెట్లను చిత్తూరు జిల్లా భక్తులకే తితిదే పరిమితం చేసింది. కరోనా దృష్ట్యా ఏప్రిల్ 11 నుంచి ఈ టోకెన్ల జారీని నిలిపేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను పొందిన భక్తులకు టోకెన్లు ఇవ్వడం లేదు. ఒకసారి దర్శనం అనంతరం నెల వ్యవధి ఉంటేనే టోకెన్ల ఇస్తున్నారు. చాలా రోజుల తర్వాత శ్రీవారి సర్వదర్శనానికి అవకాశం రావడంతో టోకెన్ల కోసం భక్తులు తిరుపతి శ్రీనివాసం కాంప్లెక్స్‌లోని కౌంటర్లకు భారీగా తరలివచ్చారు.
తిరుమలకు భారీగా భక్తుల తాకిడి
Related tags :