యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో త్వరలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్ఆర్’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న తారక్ త్వరలోనే ఈ సినిమా సెట్‌లోకి అడుగుపెట్టనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో తారక్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియాభట్ నటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే చిత్రబృందం ఆలియాను సంప్రదించగా.. ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్’తో ఆలియా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత తారక్-శివ కాంబినేషన్‌లో వస్తోన్న రెండో సినిమా ఇది. ఇందులో ఎన్టీఆర్ మునుపెన్నడూ లేనివిధంగా పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అనిరుధ్ స్వరాలు అందించనున్నారని టాక్. అక్టోబర్ నుంచి ఈసినిమా పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
NTRతో ఆలియా OK?
Related tags :