చత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో అఖిలభారత తెలుగు సేన ప్రారంభోత్సవం కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. హోటల్ గ్రాండ్ రాజ్పుతానాలో జరిగిన ఈ కార్యక్రమానికి దాదాపు 15రాష్ట్రాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. అఖిలభారత తెలుగు సేన వ్యవస్థాపకుడు పీ.ఎస్.ఎన్.మూర్తి తెలుగుసేన ఏర్పాటు, దాని ఆశయాలు, ఉద్దేశాలను గురించి ప్రతినిధులకు వివరించారు. చత్తీస్‌గఢ్ తెలుగు సంఘం అధ్యక్షుడు ఆర్.మురళి స్వాగతోపన్యాసం చేశారు. శిష్ట అనంత్, సూరిబాబు, చమర్తి నాగేశ్వరరావు, పద్మ, నీలం చెన్నకేశవ్, యొగేష్, లక్ష్మీ, ఎస్.వి.రమణ తదితరులు కార్యక్రమ సమన్వయకర్తలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. దీనికి సంబంధించిన చిత్రాలు దిగువ చూడవచ్చు…
రాయ్‌పూర్‌లో అట్టహాసంగా తెలుగుసేన ప్రారంభోత్సవం
Related tags :