NRI-NRT

డల్లాస్ తానా పాఠశాల విద్యా సంవత్సరం ప్రారంభం

డల్లాస్ తానా పాఠశాల విద్యా సంవత్సరం ప్రారంభం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యంలో ప్రవాస చిన్నారులకు తెలుగు భాష నేర్పించే “పాఠశాల” కార్యక్రమ 2021 విద్యా సంవత్సరాన్ని డల్లాస్‌లో ప్రారంభించారు. అంతర్జాలంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి ముఖ్య అతిధిగా పాల్గొని తెలుగు నేర్పించాలనే సంకల్పంతో తానా పాఠశాల ప్రారంభించామని, ఈ కార్యక్రమం ద్వారా చిన్నారులకు తెలుగు భాష చదవడం, రాయడం నేర్పిస్తామని పేర్కొన్నారు. పాఠశాల చైర్మన్ నాగరాజు నలజుల, డల్లాస్ తానా ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన, పాఠశాల కో-ఆర్డినేటర్ వెంకట శివనాగరాజు తాడిబోయిన, తానా కార్యవర్గ సభ్యుడు లోకేష్ నాయుడు కొణిదెల, ఉపాధ్యాయులు కొర్రపాటి వెంకట్, అరుణ, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.