దగ్గుబాటి అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న రోజు వచ్చేసింది. విక్టరీ వెంకటేశ్- రానా కలిసి ఒకే స్క్రీన్‌లో సందడి చేసేందుకు రంగం సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ రూపొందించనున్న ఓ వెబ్‌సిరీస్‌లో వీరిద్దరూ కలిసి స్క్రీన్ పంచుకోనున్నారు. ఈ విషయాన్ని తాజాగా వెంకీ అధికారికంగా ప్రకటించారు. చిన్నపిల్లాడి నుంచి ఒక నటుడిగా రానా ఎదిగిన ప్రతిక్షణాన్ని తాను చూస్తూనే ఉన్నానని.. కానీ ‘రానా నాయుడు’లో మునుపటి కంటే పూర్తి విభిన్నంగా రానా కనిపించనున్నాడని వెంకీ తెలిపారు. రానా సైతం.. బాబాయ్‌తో కలిసి స్క్రీన్ పంచుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. త్వరలో ప్రసారం కానున్న ఈ సిరీస్‌లో వెంకీ వృద్ధుడి పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఉండే పవర్ఫుల్ కథాంశంతో ఈ సిరీస్ రూపొందుతుందని సమాచారం.
ఒకే ఫ్రేమ్‌లో వెంకీ-రానా
Related tags :