Movies

రాధేశ్యాం లీక్స్….భాగ్యశ్రీ స్పీక్స్

రాధేశ్యాం లీక్స్….భాగ్యశ్రీ స్పీక్స్

సల్మాన్‌ ఖాన్‌ హీరోగా ‘మైనే ప్యార్ కియా’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన నటి భాగ్యశ్రీ. మొదటి సినిమాతోనే దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ సాధించింది. కానీ త్వరగానే వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టడానికి చిత్ర పరిశ్రమను విడిచిపెట్టింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తిరిగి తన నటన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈ సినీయర్‌ నటి ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో కీలకపాత్రలో నటిస్తోంది. కాగా తాజాగా ఓ ఇంటర్వూలో ఆ సినిమాలో తన పాత్ర గురించి తెలిపింది. బాలీవుడ్‌ హంగామాకి ఇచ్చిన ఇంటర్వూలో ఆమె మాట్లాడుతూ.. ‘రాధే శ్యామ్‌లో నాది తల్లి పాత్ర కాదు. కథలో ఎంతో కీలమైంది. నా పాత్రని తీసేస్తే స్టోరీ మొత్తానికి ప్రాబ్లమ్‌ అవుతుంది. ఇకపై ఇలాంటి పాత్రలే చేస్తా. ఎడిటింగ్‌లో పోయే రోల్స్‌ చేస్తే ఉపయోగం ఉండదు. ఈ సినిమా నాతోనే పాత్ర మొదలై, చివరి వరకు సాగుతుంది. అందుకే ఈ మూవీ చేశా’ అని తెలిపింది.