Food

మట్టికుండలో నోరూరించే పిజ్జా

మట్టికుండలో నోరూరించే పిజ్జా

అస‌లు పిజ్జా అనేదే మ‌న వంట‌కం కాదు. కానీ.. ఇప్పుడు మ‌న ద‌గ్గ‌ర పిజ్జా అంటే తిన‌ని వాళ్లు ఉండ‌రు. పిజ్జా పేరు ఎత్త‌గానే నోరూరుతుంది. పిజ్జాలో ఎన్నో వెరైటీలు ఉంటాయి. ఏ పిజ్జా తిన్నా.. దాని రుచే వేరు. అయితే.. మేము మాత్రం రౌండ్‌గా ఉండే పిజ్జా కాదు.. చిన్న మ‌ట్టి క‌ప్పులో పిజ్జాను త‌యారు చేసి ఇస్తాం అని చెబుతోంది సూర‌త్‌కు చెందిన ఫుడ్ స్టాల్‌.

దానికే కుల్ల‌డ్ పిజ్జా లేదా కుల్హ‌డ్ పిజ్జా అనే పేరు పెట్టారు. కుల్ల‌డ్ అంటే మట్టితో చేసిన పాత్ర అని అర్థం. మ‌ట్టి క‌ప్పులో ఈ పిజ్జాను త‌యారు చేస్తూ.. సూర‌త్‌లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది ఈ ఫుడ్ స్టాల్‌.

నిజానికి ఈ వీడియో పాత‌దే. కానీ.. ఇటీవ‌ల తెగ వైరల్ అవుతోంది. ఆమ్‌చీ ముంబై అనే యూట్యూబ్ చానెల్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు.

ఆ వీడియోను కుల్ల‌డ్ పిజ్జాను ఎలా త‌యారు చేస్తారో కూడా చూపించారు. మొత్తానికి గుజ‌రాత్‌లో ఈ కుల్ల‌డ్ పిజ్జానే ట్రెండింగ్‌. సూర‌త్ చుట్టుప‌క్క‌న ఉండే వాళ్లు కూడా ఈ కుల్ల‌డ్ పిజ్జాను తిన‌డం కోసం ఎగ‌బ‌డుతున్నారు. ఈ పిజ్జా ఎక్క‌డ దొరుకుతుందో అడ్ర‌స్ కూడా వీడియోలో చెప్పారు.

ఇంకెందుకు ఆల‌స్యం.. మీరు సూర‌త్ చుట్టుప‌క్క‌న ఉంటే.. లేదా ఎప్పుడైనా సూర‌త్ వెళ్తే కుల్ల‌డ్ పిజ్జాను టేస్ట్ చేయ‌డం మ‌రిచిపోకండి.