‘సింగం’ సినిమాలో విలన్‌గా నటించిన నైజీరియన్ చకువుమె మెల్విన్(45) నిజ జీవితంలోనూ మాదక ద్రవ్యాలు విక్రయిస్తూ పోలీసులకు చిక్కాడు. హెచ్‌బీఆర్ లేఅవుట్ బీడీఏ కాంప్లెక్స్ వద్ద మాదక ద్రవ్యాలు విక్రయిస్తుండగా బెంగళూరు కేంద్ర నేర నియంత్రణ దళం (సీసీబీ) పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 250 గ్రాముల హషిష్ తైలం, 15 గ్రాముల ఎండీఎంఏ గుళికలు, ఫోన్, రూ.2 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. చోరీ సొత్తు విలువను రూ.8 లక్షలుగా అంచనా వేశారు. లాక్‌డౌన్ సమయంలో సినిమా అవకాశాలు రాకపోవడంతో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎప్పటి నుంచి వీటిని విక్రయిస్తున్నాడు? అతనికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి? ఈ వ్యవహారంలో సినిమా పరిశ్రమకు చెందిన వారు ఉన్నారా? అనే కోణంలోనూ విచారిస్తున్నారు. వైద్యం కోసం భారత్‌కు వచ్చిన మెల్విన్.. ముంబయిలోని ఒక ఫిల్మ్ అకాడమిలో ఆరు నెలలు శిక్షణ పొందాడు. విశ్వరూపం, సింగం, అణ్ణాబాండ్, దిల్‌వాలే, జంబూసవారి, పరమాత్మ తదితర సినిమాల్లో నటించాడు.
నిజ జీవితంలోనూ డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డ “సింగం” విలన్
Related tags :